Telugu Global
Cinema & Entertainment

రేసుగుర్రాలు మరో సారి రెడీ అవుతున్నారా?

అల్లు అర్జున్ కెరీర్ లో “రేసుగుర్రం” సినిమాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లోనే వన్ అఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాని డైరెక్ట్ చేసిన సురేందర్ రెడ్డి కి కూడా మంచి పేరు వచ్చింది. అయితే మరోసారి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించాలి అని బన్నీ అనుకుంటున్నాడట. కానీ ప్రస్తుతం సురేందర్‌ రెడ్డి చాలా బిజీ. మెగాస్టార్‌తో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తెరకెక్కిస్తున్నాడు […]

రేసుగుర్రాలు మరో సారి రెడీ అవుతున్నారా?
X

అల్లు అర్జున్ కెరీర్ లో “రేసుగుర్రం” సినిమాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లోనే వన్ అఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాని డైరెక్ట్ చేసిన సురేందర్ రెడ్డి కి కూడా మంచి పేరు వచ్చింది. అయితే మరోసారి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించాలి అని బన్నీ అనుకుంటున్నాడట. కానీ ప్రస్తుతం సురేందర్‌ రెడ్డి చాలా బిజీ. మెగాస్టార్‌తో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తెరకెక్కిస్తున్నాడు ఈ డైరెక్టర్.

“సైరా” పూర్తి చేశాక కానీ సురేందర్‌రెడ్డి మరో ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టలేడు. అందుకే సురేందర్ రెడ్డి “సై రా” టెన్షన్ నుంచి బయటకి వచ్చాకే తమ సినిమా స్టార్ట్ చేద్దాం అని సురేందర్ రెడ్డి కి చెప్పాడట అల్లు అర్జున్. ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమాకి ఓకే చెప్పాడు. ఈ సినిమా అయిపోయాకే సురేందర్ రెడ్డి తో సినిమా స్టార్ట్ చేస్తాడు అల్లు అర్జున్.

First Published:  29 Nov 2018 12:24 AM GMT
Next Story