Telugu Global
Cinema & Entertainment

బంపర్ ఆఫర్ దక్కించుకున్న ప్రియాంక జవల్కర్

“టాక్సీ వాలా” సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మన తెలుగమ్మాయి ప్రియాంక జవల్కర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ భామకి ఇప్పుడు తెలగు నుంచి వరుస అవకాశాలు వస్తున్నాయి. అయితే మాస్ మహారాజ్ రవితేజ ఈ భామకి తన తదుపరి సినిమాలో అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది. రవితేజ ప్రస్తుతం విఐ ఆనంద్ ప్రాజెక్ట్ కోసం సిద్దమవుతున్నాడు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ […]

బంపర్ ఆఫర్ దక్కించుకున్న ప్రియాంక జవల్కర్
X

“టాక్సీ వాలా” సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మన తెలుగమ్మాయి ప్రియాంక జవల్కర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ భామకి ఇప్పుడు తెలగు నుంచి వరుస అవకాశాలు వస్తున్నాయి. అయితే మాస్ మహారాజ్ రవితేజ ఈ భామకి తన తదుపరి సినిమాలో అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది.

రవితేజ ప్రస్తుతం విఐ ఆనంద్ ప్రాజెక్ట్ కోసం సిద్దమవుతున్నాడు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ని ఎంపిక చేశారు. రవితేజ ద్విపాత్రాభినయం చేయనున్న ఈ సినిమా కోసం పాయల్ రాజ్ పుత్, నాబా నటేష్ కు తీసుకున్నారు.

అయితే “టాక్సీవాలా” సినిమా చూశాక ప్రియాంక జువాల్కర్ తీసుకోవాలని రవితేజ సూచించాడట. ఈ నేపథ్యంలో నాభా నటేష్ స్థానంలో ప్రియాంక జవాల్కర్ తీసుకున్నట్లు సమాచారం. మొత్తానికి ఇండస్ట్రీకి రావడంతో ఒక హీరోయిన్ పొట్ట కొట్టి తన అవకాశాన్ని దక్కించుకుంది ప్రియాంక. డిసెంబర్ నుంచి ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.

First Published:  29 Nov 2018 4:45 AM GMT
Next Story