Telugu Global
NEWS

రాహుల్, బాబు, గద్దర్ లను ఏకిపారేసిన హరీష్ రావు

కాంగ్రెస్ మేనిఫెస్టో ను విడుదల చేసింది. అందులో ఎన్నో హామీలిచ్చింది. 2 లక్షల వరకు రుణమాఫీ, మహిళలకు లక్ష గ్రాంట్, నిరుద్యోగులకు 3వేల భృతి సహా ఎన్నో ఆచరణకు సాధ్యం కానీ హామీలను మేనిఫెస్టోలో ప్రకటించింది. తాజాగా కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోపై తాజామాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. గురువారం ఉదయం తెలంగాణ భవన్ లో హరీష్ మాట్లాడుతూ…. కాంగ్రెస్ పాత మేనిఫెస్టోలను బయటకు తీశారు. 2004, 2009లో కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోలలో […]

రాహుల్, బాబు, గద్దర్ లను ఏకిపారేసిన హరీష్ రావు
X

కాంగ్రెస్ మేనిఫెస్టో ను విడుదల చేసింది. అందులో ఎన్నో హామీలిచ్చింది. 2 లక్షల వరకు రుణమాఫీ, మహిళలకు లక్ష గ్రాంట్, నిరుద్యోగులకు 3వేల భృతి సహా ఎన్నో ఆచరణకు సాధ్యం కానీ హామీలను మేనిఫెస్టోలో ప్రకటించింది.

తాజాగా కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోపై తాజామాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. గురువారం ఉదయం తెలంగాణ భవన్ లో హరీష్ మాట్లాడుతూ…. కాంగ్రెస్ పాత మేనిఫెస్టోలను బయటకు తీశారు. 2004, 2009లో కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోలలో అమలు చేయని అంశాలను లేవనెత్తి మరీ ఎండగట్టారు.

కాంగ్రెస్ పార్టీ 10ఏళ్లలో మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను కూడా అమలు చేయలేదని హరీష్ ఫైర్ అయ్యారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ఇదివరకు అమలు చేయని హామీలపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖాస్త్రం సంధిస్తున్నట్టు హరీష్ చెప్పారు. దీనిపై సమాధానం ఇచ్చాక ఇప్పటి మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని హరీష్ డిమాండ్ చేశారు.

ఇక 2014లో ఏపీలో చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోను కూడా హరీష్ బయటపెట్టారు. అందులో అమలు చేయని అంశాలను లేవనెత్తారు. అంతేకాదు.. బాబు హామీలు అమలు చేయకపోవడంతో ఏపీ కాంగ్రెస్ పార్టీ బాబు మోసగాడంటూ వేసిన పుస్తకాన్ని హరీష్ బయటపెట్టి కాంగ్రెస్-టీడీపీలను ఇరుకున పెట్టారు.

చంద్రబాబు రైతులకు రుణమాఫీ చేయని తీరును హరీష్ విమర్శించారు. మహిళా సంఘాలకు రుణాలు మాఫీ చేస్తానన్న చంద్రబాబు మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి, బాబు వస్తే జాబు వస్తుందని బాబు మోసం చేశాడని మండిపడ్డారు. 600 హామీల్లో ఏ హామీని సరిగ్గా అమలు చేయని నేత బాబు అని పేర్కొన్నారు. విశ్వసనీయత లేని బాబు.. విశ్వాసం లేని రాహుల్ ఒక్కటై తెలంగాణలోకి వస్తున్నారని ఫైర్ అయ్యారు.

తెలంగాణ రాష్ట్రసమితి 2014లో మేనిఫెస్టోలో పెట్టిన హామీల్లో 90శాతం అమలు చేశామని హరీష్ రావు చెప్పుకొచ్చారు. హామీ ఇవ్వని కళ్యాణ లక్ష్మీ, షాద్ ముబారక్, రైతుబంధు, రైతు బీమా లను కూడా అమలు చేస్తున్నామని తెలిపారు. మేనిఫెస్టోను పూర్తిస్థాయిలో అమలు చేసిన టీఆర్ఎస్ ఓటు వేస్తారా.? తప్పుడు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక అమలు చేయని తెలుగుదేశం-కాంగ్రెస్ లకు ఓటువేస్తారో ప్రజలు ఆలోచించాని హరీష్ కోరారు.

ఇక కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం పెంపుపై కూడా హరీష్ వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ మొదలు పెట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు 11 టీఎంసీల సామర్థ్యమని.. తాము దాన్ని 142 టీఎంసీలకు పెంచామని.. అందుకే ప్రాజెక్ట్ వ్యయం పెరిగిందని హరీష్ రావు వివరణ ఇచ్చారు. టీడీపీ-కాంగ్రెస్ నేతలు లాగా ప్రాజెక్టుల వ్యయం పెంచి దోచుకొని కట్టలేదని విమర్శించారు.

గోదావరి నీళ్లను ఇరు రాష్ట్రాలు వాడుకోవాలంటున్న చంద్రబాబు.. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వవద్దని మార్చి 19 , 2017న చంద్రబాబు లేఖ ఎందుకు రాశాడని హరీష్ రావు ఫైర్ అయ్యాడు. సీతారామా ప్రాజెక్టుకు ఎందుకు వ్యతిరేకంగా లేఖ రాసావని మండిపడ్డారు.

2014లో మోడీతో పొత్తు చారిత్రక అవసరమన్నారని.. ఇప్పుడు 2018లో రాహుల్ తో పొత్తు చారిత్రక అవసరమని బాబు అన్నాడని.. ఇది చారిత్రక అవసరం కాదని.. ఆయన అవసరమని బాబు తీరును హరీష్ రావు ఎండగట్టారు. మోడీతో కలిసి తప్పు చేశానని ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్న బాబుకు ఎన్ని నాలుకలు అని బాబుపై విమర్శలు గుప్పించారు.

టీడీపీ నుంచి కేసీఆర్ ఎదిగాడని విమర్శించిన బాబు తీరును హరీష్ రావు ఎండగట్టారు…. కాంగ్రెస్ నుంచి ఎదిగిన బాబు, ఆ తర్వాత కాంగ్రెస్ ను, ఎన్టీఆర్ ను వెన్నుపోటు ఎందుకు పొడిచావని విమర్శించారు.

ఇక గద్దర్ మాటలను హరీష్ రావు విమర్శించారు. తన కడుపులో బుల్లెట్ ఉందన్న గద్దర్.. ఆ కడుపులో బుల్లెట్ దించిన చంద్రబాబు కడుపులో తలపెట్టడం దురదృష్టకరమని హరీష్ రావు ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాసిన చంద్రబాబు పంచన చేరి గద్దర్ తన స్థాయిని పోగొట్టుకున్నాడని మండిపడ్డారు.

అమరావతిలో బాబు హైకోర్టు కట్టకుండా తెలంగాణపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. ఇలా బాబు మోసాలను, కాంగ్రెస్ హామీలు అమలు చేయని తీరును హరీష్ రావు ఎండగట్టారు. నిన్నటి ఖమ్మం సభలో చంద్రబాబు మాట్లాడిన మాటలను విమర్శించారు.

First Published:  29 Nov 2018 1:09 AM GMT
Next Story