Telugu Global
Cinema & Entertainment

బన్నీ పక్కన పెట్టాడు.... నాని సెట్ చేసుకున్నాడు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ “నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా” సినిమా తరువాత ఇప్పటి వరకు ఒక్క సినిమాకు కూడా సైన్ చెయ్యలేదు. అయితే అల్లు అర్జున్ మాత్రం తన తదుపరి సినిమాని విక్రం కే కుమార్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇప్పటికే విక్రం కే కుమార్ అల్లు అర్జున్ కోసం ఒక కథ కూడా రెడీ చేసాడు అనే టాక్ ఫిలిం నగర్ లో వినిపిస్తోంది. కానీ మధ్యలో అల్లు అర్జున్ ని డైరెక్ట్ […]

బన్నీ పక్కన పెట్టాడు.... నాని సెట్ చేసుకున్నాడు
X

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ “నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా” సినిమా తరువాత ఇప్పటి వరకు ఒక్క సినిమాకు కూడా సైన్ చెయ్యలేదు. అయితే అల్లు అర్జున్ మాత్రం తన తదుపరి సినిమాని విక్రం కే కుమార్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇప్పటికే విక్రం కే కుమార్ అల్లు అర్జున్ కోసం ఒక కథ కూడా రెడీ చేసాడు అనే టాక్ ఫిలిం నగర్ లో వినిపిస్తోంది.

కానీ మధ్యలో అల్లు అర్జున్ ని డైరెక్ట్ చెయ్యడానికి త్రివిక్రమ్ లైన్ లోకి వచ్చాడు. ఇక త్రివిక్రమ్ లైన్ లోకి రాగానే అల్లు అర్జున్ విక్రం కే కుమార్ తో సినిమాని పక్కన పెట్టేసాడు. దీంతో విక్రం కే కుమార్ వెళ్లి అల్లు అర్జున్ కోసం రాసుకున్న అదే కథని నానికి చెప్పాడట. నాని చేతిలో ప్రస్తుతం పెద్దగా సినిమాలు లేకపోవడంతో ఈ సినిమాని ఒప్పుకున్నాడు.

అయితే విక్రం కే కుమార్ కి, నానికి అడ్వాన్సు కూడా ఇచ్చిందట మైత్రి మూవీ మేకర్స్ సంస్థ. ఈ సినిమాని ప్రొడ్యూస్ చెయ్యడానికి ముందుకి వచ్చింది ఈ సంస్థ.

First Published:  29 Nov 2018 4:28 AM GMT
Next Story