Telugu Global
Cinema & Entertainment

"2.0" సినిమా రివ్యూ

రివ్యూ: 2.0 రేటింగ్‌: 3/5 తారాగణం:  రజనీకాంత్, అమీ జాక్సన్, అక్షయ్‌ కుమార్‌ తదితరులు సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ నిర్మాత: లైకా ప్రొడక్షన్స్ దర్శకత్వం:  ఎస్. శంకర్ సూపర్ స్టార్ రజనీకాంత్ శంకర్ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా విజువల్ ఎఫెక్ట్స్ ని ఇంతకు ముందు చూడని రీతిలో ఉన్నాయన్న పబ్లిసిటీ మీద భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్న 2.0 ఒరిజినల్ తమిళ్ వెర్షన్ కంటే ఎక్కువ హైప్ తో తెలుగులో విడుదలైంది. డబ్బింగ్ సినిమాల వరకు చూసుకుంటే ఇప్పటిదాకా టాలీవుడ్ లో అత్యంత భారీ […]

2.0 సినిమా రివ్యూ
X

రివ్యూ: 2.0
రేటింగ్‌: 3/5
తారాగణం: రజనీకాంత్, అమీ జాక్సన్, అక్షయ్‌ కుమార్‌ తదితరులు
సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
నిర్మాత: లైకా ప్రొడక్షన్స్
దర్శకత్వం: ఎస్. శంకర్

సూపర్ స్టార్ రజనీకాంత్ శంకర్ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా విజువల్ ఎఫెక్ట్స్ ని ఇంతకు ముందు చూడని రీతిలో ఉన్నాయన్న పబ్లిసిటీ మీద భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్న 2.0 ఒరిజినల్ తమిళ్ వెర్షన్ కంటే ఎక్కువ హైప్ తో తెలుగులో విడుదలైంది. డబ్బింగ్ సినిమాల వరకు చూసుకుంటే ఇప్పటిదాకా టాలీవుడ్ లో అత్యంత భారీ రిలీజ్ దక్కించుకున్న మూవీ 2.0నే. అడ్వాన్స్ బుకింగ్ లో సైతం రికార్డులు నెలకొల్పింది.

పక్షిరాజన్ (అక్షయ్ కుమార్) పిచ్చుకల ప్రేమికుడు. సెల్ ఫోన్ టవర్ల వల్ల వచ్చే రేడియేషన్ కు పక్షుల ప్రాణాలు పోతున్నాయని భావించి వాటిని నియంత్రించమని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తాడు. కానీ అది నెరవేరకపోవడంతో సూసైడ్ చేసుకుని ఆత్మగా ఒక భారీ ఆకారంలోకి మారి ప్రజల సెల్ ఫోన్స్ మాయం చేయడం ప్రారంభిస్తాడు. పనిలో పనిగా కొన్ని హత్యలు కూడా చేస్తాడు. ప్రభుత్వం వశీకరన్(రజనికాంత్)సహాయంతో చిట్టి(రజనీకాంత్)ని తిరిగి బ్రతికించి పక్షిరాజా కథను ముగిస్తుంది. కానీ అనూహ్యంగా పక్షిరాజా తిరిగి వచ్చి చిట్టిని నామరూపాల్లేకుండా చేస్తాడు. ఆ తర్వాత 2.0 రంగ ప్రవేశం చేసి పక్షిరాజాను అంతమొందించడమే 2.0.

రజనీకాంత్ ఇంత వయసులోనూ ఇలాంటి కథలను ఎంచుకుంటున్నందుకు మెచ్చుకోవాలి. సూపర్ స్టార్ గా రెగ్యులర్ మసాలా సినిమాలు తీసుకోక రిస్క్ తీసుకుని ఇలాంటి పాత్రలకు ఓకే చెప్పడం అంటే మాటలు కాదు. వశీకరన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు కాబట్టి మొత్తం చిట్టి అండ్ 2.0 లతోనే షో నడిపించేశారు. తనకు మాత్రమే సాధ్యమయ్యే ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ తో రజని అలరించాడు. క్లిష్టంగా అనిపించే షాట్స్ చాలా ఉన్నాయి. చిట్టిగా రజని బెస్ట్ ఛాయస్. మరోమాటకు తావు లేదు.

అక్షయ్ కుమార్ పక్షిరాజాగా ప్రాణం పోసాడు. ఫ్లాష్ బ్యాక్ లో దీనంగా పక్షుల కోసం తపించే ముసలివాడిగా, వర్తమానంలో వికృత రూపంలోకి మారిపోయిన పిచ్చుకగా విశ్వరూపం చూపించాడు. అమీ జాక్సన్ ది చాలా పరిమితమైన పాత్ర. రోబో కావడంతో ఎక్స్ పోజింగ్, గ్లామర్ షోకి ఛాన్స్ లేకుండా పోయింది. వీళ్ళు తప్ప పెద్దగా ఇంకెవరు కనిపించరు.

దర్శకుడు శంకర్ ఐడియా బాగుంది. సెల్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోవడం పర్యావరణానికి ఏ రకంగా హానీ చేస్తుంది అనే థీమ్ ని బాగా రాసుకున్నాడు కానీ దానికి దన్నుగా నిలవాల్సిన బలమైన పాత్రలు, ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే ఎపిసోడ్లు లేకపోవడం అసంతృప్తికి గురి చేస్తుంది.

రోబోలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అంతటి ఆదరణ దక్కింది. కానీ 2.0 దాని కంటే బలంగా ఉండాల్సిన ఈ అంశాలన్నీ శంకర్ పూర్తిగా విస్మరించాడు. కేవలం పక్షి రాజు చిట్టి ల మధ్య యుద్ధం ప్లస్ మధ్యలో రావాల్సిన ఎఫెక్ట్స్ మీద శ్రద్ధ కథనం మీద పెట్టలేకపోయాడు. అందువల్ల 2.0 పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. దానికి తోడు కథ రెండున్నర గంటలే ఉన్నప్పటికీ ఎక్కడా మలుపులు లేకుండా ఫ్లాట్ గా తీసుకుంటూ పోవడం ఆశ్చర్యపరుస్తుంది. రోబోలో ఉన్న బలాలన్ని 2.0కు బలహీనతగా మారాయి. అమీ జాక్సన్ ని సైతం రోబోని చేయడంతో గ్లామర్ షోకు ఛాన్స్ లేకుండా పోయింది.

ఎఫెక్ట్స్ పరంగా సంతృప్తి పరిచినా ఫైనల్ గా 2.0 కాన్సెప్ట్ పరంగా ప్రెజెంటేషన్ పరంగా శంకర్ ప్రేక్షకుల అంచనాలు అందుకోలేక పోయాడు. రెహమాన్ సంగీతం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వరకు బాగుంది. టైటిల్ కార్డులో తప్ప పాటలు లేవు. అక్షయ్ కుమార్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే బిట్ సాంగ్ సోసోనే. నీరవ్ షా కెమెరా పనితనం హాలీవుడ్ రేంజ్ లో ఉంది. బిల్డప్ ఇచ్చిన రేంజ్ లో గ్రాఫిక్స్ మాత్రం లేవు. క్లైమాక్స్ కన్నా ప్రీ ఇంటర్వెల్ లో వచ్చే విజువల్ ఎఫెక్ట్స్ ఆకట్టుకుంటాయి. లైకా సంస్థ చెప్పుకున్నట్టు ఇది ఆరు వందల కోట్లతో తీసారా అనే అనుమానం అయితే వస్తుంది. అయినప్పటికీ వందల కోట్ల ఖర్చు జరిగిన మాట వాస్తవం.

చివరిగా చెప్పాలంటే 2.0 అంచనాలు సగం కూడా అందుకోలేక ఓ యావరేజ్ గా మిగిలిన ఖరీదైన ప్రయత్నం. ఎమోషన్స్, ఆకర్షించే అంశాలంటూ ప్రత్యేకంగా ఏవి లేకుండా కేవలం గ్రాఫిక్స్ తో నిండిన యాక్షన్ ఎపిసోడ్లు చూడాలంటే మాత్రం 2.0ని ఓ ఛాయస్ గా పెట్టుకోవచ్చు తప్ప కంటెంట్ కూడా ఉండాలి అంటే వెనక్కు వెళ్లి రోబో చూసుకోవడం ఉత్తమం. కాకపోతే ఇలాంటి ప్రయత్నాలు ప్రతిసారి జరిగేవి కాదు కాబట్టి ఓసారి చూసినా నిరాశ పరచదు.

2.0 – ఓన్లీ గ్రాఫిక్స్ – నో ఫీలింగ్స్

First Published:  29 Nov 2018 5:17 AM GMT
Next Story