Telugu Global
NEWS

కంగారూ గడ్డపై సచిన్ రికార్డుకు కొహ్లీ గురి

ఆసీస్ పై ఆస్ట్రేలియాలో 6 శతకాల సచిన్ 5 శతకాలతో సచిన్ తర్వాతి స్థానంలో కొహ్లీ మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతో ఉన్న ఒక్కో రికార్డును అధిగమిస్తూ వస్తున్న…విరాట్ కొహ్లీ…కంగారూ గడ్డపై మాస్టర్ సాధించిన అత్యధిక సెంచరీల రికార్డుకు గురిపెట్టాడు. ఆస్ట్రేలియాతో డిసెంబర్ 6న ప్రారంభమయ్యే నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లోనే…కొహ్లీ సరికొత్త రికార్డు నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తోంది.  కంగారు గడ్డపై 6 శతకాల సచిన్… ఫాస్ట్ , బౌన్సీ పిచ్ లకు మరోపేరైన ఆస్ట్రేలియా గడ్డపై […]

కంగారూ గడ్డపై సచిన్ రికార్డుకు కొహ్లీ గురి
X
  • ఆసీస్ పై ఆస్ట్రేలియాలో 6 శతకాల సచిన్
  • 5 శతకాలతో సచిన్ తర్వాతి స్థానంలో కొహ్లీ

మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతో ఉన్న ఒక్కో రికార్డును అధిగమిస్తూ వస్తున్న…విరాట్ కొహ్లీ…కంగారూ గడ్డపై మాస్టర్ సాధించిన అత్యధిక సెంచరీల రికార్డుకు గురిపెట్టాడు.

ఆస్ట్రేలియాతో డిసెంబర్ 6న ప్రారంభమయ్యే నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లోనే…కొహ్లీ సరికొత్త రికార్డు నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తోంది.

కంగారు గడ్డపై 6 శతకాల సచిన్…

ఫాస్ట్ , బౌన్సీ పిచ్ లకు మరోపేరైన ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక సెంచరీలు సాధించిన భారత క్రికెటర్ రికార్డు మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతోనే ఉంది. సచిన్ తన కెరియర్ లో ఆస్ట్రేలియా గడ్డపై…. ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా ఆరు శతకాలు సాధించాడు.

మాజీ ఓపెనర్ సునీల్ గవాస్కర్ 11 టెస్టుల్లో 5 శతకాలు బాదితే…విరాట్ కొహ్లీ కేవలం 8 టెస్టుల్లోనే 5 సెంచరీలతో మాస్టర్ తర్వాతి స్థానంలో ఉన్నాడు.

హైదరాబాదీ వెరీవెరీ స్పెషల్ బ్యాట్స్ మన్ వీవీఎస్ లక్ష్మణ్ ..కంగారూ గడ్డపై నాలుగు సెంచరీలు సాధించడం ద్వారా నాలుగోస్థానంలో కొనసాగుతున్నాడు.

ఇద్దరూ ఇద్దరే…

ఇటు విరాట్ కొహ్లీ…అటు మాస్టర్ సచిన్….ఇద్దరూ 26 ఏళ్ల వయసుకే ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా వెయ్యి పరుగుల మైలురాయిని చేరిన మొనగాళ్లుగా నిలిచారు.

1999 డిసెంబర్ 28న మాస్టర్ సచిన్ 26 సంవత్సరాల వయసులో 5 శతకాలతో సహా వెయ్యి పరుగుల మైలురాయిని చేరాడు.

విరాట్ కొహ్లీ సైతం…2014 డిసెంబర్ 28న ఆస్ట్రేలియా పై ఐదోశతకంతో పాటు వెయ్యి పరుగులు సాధించడం విశేషం.

సచిన్ మొత్తం 20 టెస్టుల్లో 1809 పరుగులతో 53.20 సగటు సాధించాడు. విరాట్ కొహ్లీ ఆడిన 8 టెస్టుల్లోనే 992 పరుగులతో 62,00 సగటు నమోదు చేశాడు.

విరాట్ కొహ్లీకి భలే చాన్స్….

ఆస్ట్రేలియాతో డిసెంబర్ 6 నుంచి ప్రారంభమయ్యే నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ద్వారా…మాస్టర్ సచిన్ పేరుతో ఉన్న ఆరుశతకాల రికార్డును విరాట్ కొహ్లీ … అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది.

సిరీస్ లోని తొలిటెస్ట్ మ్యాచ్ అడిలైడ్ ఓవల్ వేదికగా డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ ఓవల్ వేదికగా జరుగుతుంది.

రెండోటెస్ట్ పెర్త్ వేదికగా డిసెంబర్ 14న ప్రారంభమవుతుంది. ఆ తర్వాత…మెల్బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ ను నిర్వహిస్తారు. డిసెంబర్ 26 నుంచి.. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం మెల్బోర్న్ వేదికగా మూడోటెస్ట్ ను బాక్సింగ్ డే మ్యాచ్ గా జరుగుతుంది.

సిడ్నీ వేదికగా జనవరి 1 నుంచి నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ నాలుగు టెస్టులు…8 ఇన్నింగ్స్ లో..కొహ్లీ స్థాయికి తగ్గట్టుగా ఆడితే…కనీసం మూడు నుంచి నాలుగు శతకాలు సాధించే అవకాశం లేకపోలేదు.

73 టెస్టులు – 24 శతకాలు…

30 సంవత్సరాల విరాట్ కొహ్లీకి…ఇప్పటి వరకూ ఆడిన 73 టెస్టులు,124 ఇన్నింగ్స్ లో 24 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలతో సహా…మొత్తం 6వేల 331 పరుగులు సాధించాడు.

మాస్టర్ సచిన్ టెండుల్కర్ 51 టెస్ట్ సెంచరీల రికార్డుకు…కొహ్లీ 26 శతకాల దూరంలో నిలిచాడు.

రానున్న కాలంలో సచిన్ పేరుతో ఉన్న సెంచరీలు, పరుగుల రికార్డులను విరాట్ కొహ్లీ అధిగమించినా ఆశ్చర్యం లేదు.

First Published:  28 Nov 2018 7:15 AM GMT
Next Story