Telugu Global
National

రాహుల్ సభల వెనుక ప్లాన్ ఇదేనా ?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సోనియాగాంధీ చేసిన ప్రసంగంతో రాష్ట్రం లో రాజకీయాలు హీటక్కెయ్యాయి. వార్ వన్‌సైడ్ జరుగుతుందనుకున్న పరిస్థితుల నుంచి నువ్వా…. నేనా అనే పరిస్థితికి కాంగ్రెస్ చేరింది. మేడ్చల్ లో రాహుల్, సోనియాగాంధీ సభ సక్సెస్ తో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చింది. ఈ జోష్ ను మరింత పెంచేలా రాహుల్ పర్యటనలు కొనసాగుతున్నాయి. గులాబీ అగ్రనేతలే లక్ష్యంగా రాహుల్ ముందుకు కదులుతున్నారు. గులాబీ కోటను కొల్లగొట్టేందుకు రాహుల్ […]

రాహుల్ సభల వెనుక ప్లాన్ ఇదేనా ?
X

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సోనియాగాంధీ చేసిన ప్రసంగంతో రాష్ట్రం లో రాజకీయాలు హీటక్కెయ్యాయి. వార్ వన్‌సైడ్ జరుగుతుందనుకున్న పరిస్థితుల నుంచి నువ్వా…. నేనా అనే పరిస్థితికి కాంగ్రెస్ చేరింది. మేడ్చల్ లో రాహుల్, సోనియాగాంధీ సభ సక్సెస్ తో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చింది.

ఈ జోష్ ను మరింత పెంచేలా రాహుల్ పర్యటనలు కొనసాగుతున్నాయి. గులాబీ అగ్రనేతలే లక్ష్యంగా రాహుల్ ముందుకు కదులుతున్నారు. గులాబీ కోటను కొల్లగొట్టేందుకు రాహుల్ పక్కా ప్రణాళికతో పాగాకు యత్నిస్తున్నారు. దీనిలో భాగంగా మంత్రులు, స్పీకర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనే రాహుల్ సభలు ఉంటున్నాయి.

ఈనెల 29న భూపాలపల్లిలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్వహించాల్సిన సభనుభూపాలపల్లికి మార్చడం వెనుక పెద్ద మతలబు ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఈ సభకు భూపాలపల్లి, ములుగు, పరకాల, మంథని, వరంగల్ తూర్పు, హుజురాబాద్ నియోజకవర్గాల నుంచి భారీగా జనసమీకరణ చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఒక్క భూపాలపల్లి నుంచే 70వేలు, మిగతా ఐదు నియోజకవర్గాల నుంచి 80వేల మందిని తరలించి కాంగ్రెస్ సత్తా చాటాలని నేతలు భావిస్తున్నారు.

ఉత్తర తెలంగాణలో గులాబీ పార్టీకి బలంగా ఉన్న నేతలనే రాహుల్ లక్ష్యంగా చేసుకొని ముందుకు వెళున్నతున్నట్లు వినికిడి. భూపాలపల్లి నుంచి స్పీకర్ మధుసూదనాచారి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ములుగు నుంచి మంత్రి చందులాల్, హుజూరాబాద్ నుంచి మంత్రి ఈటల రాజేందర్ గులాబీ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఈ ముగ్గురితోపాటు రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మంథని పరిధిలోనే ఉంది.

అదేవిధంగా 2014లో టీఆర్ఎస్ గెలిచిన వరంగల్ తూర్పు, పరకాల నియోజకవర్గాల్లో ఇప్పుడు కొండా సురేఖ, వారి అనుచరుడు గాయత్రి రవి బరిలో ఉన్నారు. గతంలో ఇక్కడి ఆరు నియోజకవర్గాల్లో గెలిచిన టీఆర్‌ఎస్‌ గులాబీ కోటగా మలుచుకుంది. గత సింగరేణి ఎన్నికల్లో భూపాలపల్లిలో కాంగ్రెస్ కూటమి గుర్తింపు సంఘంగా గెలిచింది. దీంతో భూపాలపల్లి, మంథని నియోజకవర్గాల్లో కీలకంగా ఉన్న సింగరేణి కార్మికుల పై రాహుల్ సభ ప్రభావం చూపనుంది. ఈ గులాబీ కోటను బద్దలు కొట్టేందుకు కాంగ్రెస్ వ్యూహం పన్నినట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ ముఖ్యనేతల నియోజకవర్గాలపై రాహుల్ గురిపెట్టాడు. మరి ఈ రాహుల్ ప్లాన్ ఎంత మేరకు సక్సెస్ అవుతుంది.? గులాబీ కోటలను కొట్టడం రాహుల్ వల్ల అవుతుందా అనేది వేచిచూడాల్సిందే.

First Published:  28 Nov 2018 1:55 AM GMT
Next Story