Telugu Global
NEWS

మంత్రి అయ్యన్న హత్యకు కుట్ర.... వీడియో వైరల్‌

మంత్రి చింతకాయల అయన్నపాత్రుడి హత్యకు కుట్ర జరిగిందంటూ ఒక వీడియో రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయన్నపాత్రుడి సోదరుడు సన్యాసినాయుడే ఈ హత్యకు కుట్ర చేశాడని సదరు వీడియో ద్వారా ప్రచారం జరుగుతోంది. కిరాయి హంతకులతో సన్యాసినాయుడు చర్చలు అంటూ వీడియోను ప్రచారంలోకి తెచ్చారు. వీడియోలో అయ్యన్న సోదరుడు సన్యాసి పాత్రుడు కొంతమంది వ్యక్తులతో మాట్లాడుతుండగా, వారు మంత్రి అయ్యన్న పాత్రుడ్ని హతమార్చడానికి కుట్ర పన్నేందుకే అక్కడ సమావేశమైనట్టుగా చూపించారు. దీనిపై సన్యాసినాయుడు కుమారుడు […]

మంత్రి అయ్యన్న హత్యకు కుట్ర.... వీడియో వైరల్‌
X

మంత్రి చింతకాయల అయన్నపాత్రుడి హత్యకు కుట్ర జరిగిందంటూ ఒక వీడియో రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయన్నపాత్రుడి సోదరుడు సన్యాసినాయుడే ఈ హత్యకు కుట్ర చేశాడని సదరు వీడియో ద్వారా ప్రచారం జరుగుతోంది. కిరాయి హంతకులతో సన్యాసినాయుడు చర్చలు అంటూ వీడియోను ప్రచారంలోకి తెచ్చారు.

వీడియోలో అయ్యన్న సోదరుడు సన్యాసి పాత్రుడు కొంతమంది వ్యక్తులతో మాట్లాడుతుండగా, వారు మంత్రి అయ్యన్న పాత్రుడ్ని హతమార్చడానికి కుట్ర పన్నేందుకే అక్కడ సమావేశమైనట్టుగా చూపించారు.

దీనిపై సన్యాసినాయుడు కుమారుడు తీవ్రంగా స్పందించారు. తన తండ్రి ప్రతిష్టను దెబ్బతీయడానికి, కుటుంబంలో విభేదాలు తెచ్చేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

తన తండ్రి తరపున పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 21న నర్సీపట్నంలో వివాహానికి హాజరైన సమయంలో తాను అక్కడికి వచ్చిన వారితో కలిసి మాట్లాడుతున్న సీసీ దృశ్యాలను సేకరించి … దాన్ని ఇలా కావాల్సిన విధంగా వాడుకున్నారని సన్యాసినాయుడు ఆరోపించారు. వీడియో వెనుక ఎవరున్నారో తేల్చాలని పోలీసులకు ఫిర్యాదులో కోరారు.

First Published:  27 Nov 2018 10:09 PM GMT
Next Story