Telugu Global
Cinema & Entertainment

మిస్టర్ మజ్నుపై అఖిల్ క్లారిటీ

మిస్టర్ మజ్ను సినిమాపై చాలా అనుమానాలున్నాయి ఆడియన్స్ కు. జనవరిలో థియేటర్లలోకి వస్తున్నామని యూనిట్ చెబుతోంది. సినీజనాలు మాత్రం కష్టం అంటున్నారు. వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి రెండో వారానికి వాయిదా పడుతుందని బెట్ కడుతున్నారు. దాదాపు వారం రోజులుగా నలుగుతున్న ఈ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టాడు అఖిల్. సినిమా షూటింగ్ అప్ డేట్స్ తో పాటు విడుదలపై క్లారిటీ ఇచ్చాడు మిస్టర్ మజ్ను సినిమా కచ్చితంగా జనవరిలోనే వస్తుందని మరోసారి ప్రకటించాడు అఖిల్. ఈ […]

మిస్టర్ మజ్నుపై అఖిల్ క్లారిటీ
X
మిస్టర్ మజ్ను సినిమాపై చాలా అనుమానాలున్నాయి ఆడియన్స్ కు. జనవరిలో థియేటర్లలోకి వస్తున్నామని యూనిట్ చెబుతోంది. సినీజనాలు మాత్రం కష్టం అంటున్నారు. వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి రెండో వారానికి వాయిదా పడుతుందని బెట్ కడుతున్నారు. దాదాపు వారం రోజులుగా నలుగుతున్న ఈ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టాడు అఖిల్. సినిమా షూటింగ్ అప్ డేట్స్ తో పాటు విడుదలపై క్లారిటీ ఇచ్చాడు
మిస్టర్ మజ్ను సినిమా కచ్చితంగా జనవరిలోనే వస్తుందని మరోసారి ప్రకటించాడు అఖిల్. ఈ మేరకు సుదీర్ఘంగా ట్వీట్ పెట్టాడు. ఎవరూ నమ్మరేమో అనుకున్నాడేమో, మూవీ అప్ డేట్స్ కూడా చెప్పుకొచ్చాడు. ఒక్క పాట మినహా డిసెంబర్ 3 నాటికి షూటింగ్ మొత్తం పూర్తయిపోతుందని. సెట్ లో తీయాల్సిన ఆ ఒక్క పాటు 3-4 రోజుల్లో పూర్తిచేసి జనవరికి వచ్చేస్తామని క్లారిటీ ఇచ్చాడు అఖిల్.
అఖిల్ ప్రకటనతో ఇన్నాళ్లూ మిస్టర్ మజ్నుపై చెలరేగిన వదంతులకు ఫుల్ స్టాప్ పడింది. తాజా సమాచారం ప్రకారం.. జనవరి ఆఖరి వారంలో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.
First Published:  28 Nov 2018 7:33 AM GMT
Next Story