Telugu Global
NEWS

ఇప్పుడే హెలికాప్టర్‌లో వస్తా.... మోడీకి కేసీఆర్‌ చాలెంజ్‌

ఎన్నికల్లో టీఆర్‌ఎస్ భారీ విజయం సొంతం చేసుకోబోతోందని అన్ని సర్వేలు చెబుతున్నాయని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. అన్ని వర్గాలు కలిసి బతకాలని కోరుకునే ప్రభుత్వం తమది అన్నారు. 2014లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మోడీ, చంద్రబాబు కలిసి ఇక్కడి ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేశారన్నారు. ఆ సమయంలో అసదుద్దీన్‌ ఓవైసీనే ఢిల్లీ నుంచి తొలుత ఫోన్ చేసి చంద్రబాబు, మోడీ చేస్తున్న కుట్రను తనకు వివరించారన్నారు. మహబూబ్‌ నగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన కేసీఆర్‌… […]

ఇప్పుడే హెలికాప్టర్‌లో వస్తా.... మోడీకి కేసీఆర్‌ చాలెంజ్‌
X

ఎన్నికల్లో టీఆర్‌ఎస్ భారీ విజయం సొంతం చేసుకోబోతోందని అన్ని సర్వేలు చెబుతున్నాయని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. అన్ని వర్గాలు కలిసి బతకాలని కోరుకునే ప్రభుత్వం తమది అన్నారు.

2014లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మోడీ, చంద్రబాబు కలిసి ఇక్కడి ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేశారన్నారు. ఆ సమయంలో అసదుద్దీన్‌ ఓవైసీనే ఢిల్లీ నుంచి తొలుత ఫోన్ చేసి చంద్రబాబు, మోడీ చేస్తున్న కుట్రను తనకు వివరించారన్నారు.

మహబూబ్‌ నగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన కేసీఆర్‌… చంద్రబాబు పెత్తనం ఇంకా అవసరమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మాత్రం చంద్రబాబును భుజానెత్తుకుని వస్తోందన్నారు. ఇలాంటి పార్టీని కాలితో, చేతితో కాకుండా ఓటుతో కొట్టాలన్నారు. ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి పరీక్ష అన్నారు.

మనలో ఇబ్బందులుంటే, సమస్యలుంటే సరిచేసుకుందామని… అంతేకాని పరాయిపాలనలోకి వెళ్లవద్దని సూచించారు. దరఖాస్తు తీసుకుని విజయవాడకు వెళ్లాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రజలకు రాకూడదన్నారు. కాంగ్రెస్‌- టీడీపీ అధికారంలోకి వస్తే సంక్షేమం దెబ్బతింటుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెంట్‌ కూడా ఇవ్వలేదన్నారు. కేంద్రంలో మతగజ్జి పార్టీ అధికారంలో ఉందన్నారు.

మోడీకి ఎవరు రాసిచ్చారో గానీ తెలివి తక్కువగా మాట్లాడుతున్నారన్నారు. ”నిజామాబాద్‌లో కరెంట్‌ లేదని మోడీ చెబుతున్నారు. నరేంద్రమోడీ…. నేను సవాల్ చేస్తున్నా…. నువ్వు రమ్మంటే ఇప్పుడే హెలికాప్టర్ వేసుకుని మహబూబ్ నగర్ నుంచి నిజామాబాద్ వస్తా…. నిజామాబాద్‌లోనే సభ పెట్టి ప్రజలను అడుగుదాం… అక్కడి ప్రజలు కరెంట్‌ కోసం ఇబ్బందిపడుతున్నారేమో తేలుద్దాం” అని కేసీఆర్ సవాల్ చేశారు.

ప్రధాని స్థాయి వ్యక్తి తెలంగాణలో కరెంట్‌ లేదని అబద్దాలు మాట్లాడడం సరైనదేనా అని ప్రశ్నించారు. గతంలో అమిత్‌ షా కూడా ఇలాగే వచ్చి అబద్దాలు చెప్పిపోయారన్నారు. ఇప్పుడు మోడీ వచ్చి అదే అబద్దాలు చెబుతున్నారన్నారు. తాను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదన్నారు. తానేమైనా చంద్రబాబునా మోడీని చూసి భయపడడానికి అని కేసీఆర్ ప్రశ్నించారు.

పాలమూరు జిల్లాలో పుట్టిన ముగ్గురు కాంగ్రెస్ దరిద్రులు పాలమూరు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 50 కేసులు వేశారన్నారు. తాను చెప్పేది నిజం కాకపోతే తమను కూడా ఓడించాలని పిలుపునిచ్చారు. తాము చెప్పే దాంట్లో నిజం ఉంటే అవతలి పార్టీకి డిపాజిట్లు రాకుండా చేయాలన్నారు. ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయసును పెంచుతామన్నారు.

మహబూబ్‌నగర్‌లో టీడీపీ అభ్యర్థి నిలబడ్డారని… మీకు నీళ్లు రానివ్వను అన్న చంద్రబాబు వ్యక్తి పోటీలో ఉంటే ఓటేసేందుకు మహబూబ్‌నగర్‌ ప్రజలేమైనా చీము రక్తం లేకుండా ఉన్నారా అని ప్రశ్నించారు. తెలంగాణలో ఈ తరహా రాజకీయం చెల్లదు అని చాటేందుకు టీడీపీ అభ్యర్థికి మహబూబ్‌నగర్‌లో డిపాజిట్లు కూడా రాకుండా చేయాలని పిలుపునిచ్చారు కేసీఆర్.

First Published:  27 Nov 2018 3:44 AM GMT
Next Story