Telugu Global
NEWS

పవిత్రమన్న మట్టిలో పందికొక్కులు సొరంగాలు తవ్వాయి " హర్ష కుమార్‌

మాట వరుసకు పలాన వ్యక్తి అధికారంలోకి వస్తే అంతా అమ్మేస్తారని అంటుంటామని… చంద్రబాబు మాత్రం నిజంగానే అమరావతి ప్రాంతాన్ని సింగపూర్‌కు అమ్మేశారని మాజీ ఎంపీ హర్షకుమార్ విమర్శించారు. రాజధాని ప్రాంతంలో పర్యటించిన హర్షకుమార్… అక్కడి పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. పంట ద్వారా రోజుకు రెండు వేలు సంపాదించే రైతులను, రైతు కూలీల జీవితాలను నాశనం చేశారని మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు వల్ల వ్యవసాయ కూలీలు ఉపాధిలేని వారిగా మారిపోయారన్నారు. పలాన వాడు వస్తే అమ్మేస్తాడురా […]

పవిత్రమన్న మట్టిలో పందికొక్కులు సొరంగాలు తవ్వాయి  హర్ష కుమార్‌
X

మాట వరుసకు పలాన వ్యక్తి అధికారంలోకి వస్తే అంతా అమ్మేస్తారని అంటుంటామని… చంద్రబాబు మాత్రం నిజంగానే అమరావతి ప్రాంతాన్ని సింగపూర్‌కు అమ్మేశారని మాజీ ఎంపీ హర్షకుమార్ విమర్శించారు. రాజధాని ప్రాంతంలో పర్యటించిన హర్షకుమార్… అక్కడి పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు.

పంట ద్వారా రోజుకు రెండు వేలు సంపాదించే రైతులను, రైతు కూలీల జీవితాలను నాశనం చేశారని మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు వల్ల వ్యవసాయ కూలీలు ఉపాధిలేని వారిగా మారిపోయారన్నారు. పలాన వాడు వస్తే అమ్మేస్తాడురా అని మాటవరుసకు అంటామని… ఇక్కడ మాత్రం చంద్రబాబు నిజంగానే రాజధానిని సింగపూర్‌కు అమ్మేశారని హర్షకుమార్ వ్యాఖ్యానించారు.

ప్రధాని మోడీ చేత శంకుస్థాపన చేయించిన ప్రాంతం అత్యంత దారుణంగా ఉందన్నారు. పవిత్రమంటూ తెచ్చిన మట్టిని కుప్పగా వేశారని…. ఆ మట్టిలో పందికొక్కులు సొరంగాలు చేసుకున్నాయన్నారు. యజ్ఞశాల శిథిలమై పోయిందన్నారు.

గ్రాఫిక్స్ తప్ప ఇక్కడ ఏమీ కనిపించడం లేదన్నారు. ఈ తరహా గ్రాఫిక్స్‌ నిర్మాణాలను కనీసం చంద్రబాబు మనవడైనా చూడగలరా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో పెట్టిన కేసు గురించి భయపడిపారిపోయి వచ్చి… ఇక్కడ పూర్తి రియల్‌ఎస్టేట్‌ బ్రోకర్లుగా మారి… రైతులను బెదిరించి, భయపెట్టి భూములు తీసుకుని పచ్చటి భూములను నాశనం చేశారన్నారు. ఈ దారుణాన్ని మీడియా కూడా చూపించాలని కోరారు.

ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉందో ఫొటోలు కూడా తీశానని… వాటిని ప్రధాని దృష్టికి కూడా తీసుకెళ్లానని హర్షకుమార్‌ చెప్పారు. ఇలా దళితులను అణచివేస్తున్న చంద్రబాబుతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోవడం చూసి సిగ్గుపడుతున్నానని వ్యాఖ్యానించారు.

రాజధాని ప్రకటించడానికి ముందే మంత్రులు, వారి మనుషులు రాజధాని ప్రాంతంలో దళిత రైతులను భయపెట్టి… అసైన్డ్‌ భూములకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వదని భయపెట్టి తక్కువ ధరకు కొనుగోలు చేశారన్నారు. ఆరువేల ఎకరాల్లో 60శాతం అసైన్డ్‌ భూమిని ఇదే తరహాలో టీడీపీ మంత్రులు, బినామీలు కొనుగోలు చేసిన తర్వాత అసైన్డ్‌ భూములకు కూడా ప్యాకేజీని ప్రకటించారన్నారు.

తొలి నుంచి అసైన్డ్ ల్యాండ్ ఎవరి పేరు మీద ఉందో వారికే పరిహారం ఇవ్వాలన్నారు. చట్టం కూడా అసైన్డ్ ల్యాండ్‌ కొంటే చెల్లదని చెబుతోందని… కానీ చంద్రబాబు మాత్రం తన వారి కోసం దాన్ని పట్టించుకోవడం లేదన్నారు. దళితుల నోట్లో మట్టి కొడుతున్నారని ఆవేదన చెందారు. 15 రోజుల్లోగా రాజధాని ప్రాంత దళితుల సమస్యలు పరిష్కరించకుంటే ఇక్కడే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హర్షకుమార్ ప్రకటించారు.

First Published:  26 Nov 2018 11:03 PM GMT
Next Story