Telugu Global
NEWS

కుప్పం ఖాళీ చేస్తున్న బాబు

వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు నారా లోకేష్‌ కోసం సురక్షితమైన స్థానాన్ని అన్వేషిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఇందులో భాగంగా తాను పోటీ చేసిన కుప్పం నియోజక వర్గాన్ని కుమారుడికి వదిలేసేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. తాను మాత్రం అనంతపురం జిల్లా నుంచి పోటీ చేసేందుకు సన్నద్దమవుతున్నారు. ఇటీవల అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు పార్టీ నేతల సమావేశంతో తన ఆలోచనను పంచుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచి తాను పోటీ చేయాలనుకుంటున్నానని వెల్లడించారు. కల్యాణదుర్గం […]

కుప్పం ఖాళీ చేస్తున్న బాబు
X

వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు నారా లోకేష్‌ కోసం సురక్షితమైన స్థానాన్ని అన్వేషిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఇందులో భాగంగా తాను పోటీ చేసిన కుప్పం నియోజక వర్గాన్ని కుమారుడికి వదిలేసేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు.

తాను మాత్రం అనంతపురం జిల్లా నుంచి పోటీ చేసేందుకు సన్నద్దమవుతున్నారు. ఇటీవల అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు పార్టీ నేతల సమావేశంతో తన ఆలోచనను పంచుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచి తాను పోటీ చేయాలనుకుంటున్నానని వెల్లడించారు.

కల్యాణదుర్గం నియోజకవర్గం నుంచి పోటీకి చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారు. కల్యాణదుర్గం నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందో పరిశీలించి తనకు నివేదిక ఇవ్వాల్సిందిగా జిల్లా నాయకత్వాన్ని చంద్రబాబు ఆదేశించారు.

మొన్నటి ఎన్నికల్లో 14 స్థానాల్లో ఏకంగా 12 స్థానాలను అనంతపురం జిల్లాలో టీడీపీ కైవసం చేసుకుంది. పైగా కల్యాణదుర్గంలో అయితే గెలుపు నల్లేరు మీద నడకేనని చంద్రబాబు భావిస్తున్నారు. ఈనియోజకవర్గం రాప్తాడుకు, రాయదుర్గం నియోజక వర్గాలకు అనుకునే ఉంది.

పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి 2009లో కల్యాణదుర్గం నుంచే ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టారు. రఘువీరా రెడ్డికి ఇక్కడ పట్టుంది. ప్రస్తుతం కల్యాణదుర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీడీపీకి పట్టుండడం, వచ్చే ఎన్నికల్లో ఎలాగో కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుంది కాబట్టి పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి హయంలో జరిగిన అభివృద్ధి , ఆయనకు ఉన్న పట్టు వల్ల ఈజీగా గెలుపు సాధించవచ్చని చంద్రబాబు ఆలోచనగా ఉందని చెబుతున్నారు.

ఇప్పటికే అనంతపురం జిల్లా హిందూపురం నుంచి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అనంతపురం జిల్లా వైపే మొగ్గుచూపుతున్నారు. అనంతపురం జిల్లా తొలి నుంచి కూడా టీడీపీకి అండగా ఉంటూ వస్తుండడంతో వచ్చే ఎన్నికల్లో పోటీకి కల్యాణదుర్గమే సురక్షిత స్థానంగా చంద్రబాబు భావిస్తుండవచ్చు.

First Published:  27 Nov 2018 2:10 AM GMT
Next Story