Telugu Global
NEWS

అర్థమయ్యేలా లెక్కలు చెప్పిన బుగ్గన

ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల పాలు చేసిన చంద్రబాబు… మీడియాలో మాత్రం తానో గొప్ప నాయకుడిగా ప్రచారం చేయించు కుంటున్నారని పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి మండిపడ్డారు. అమరావతిని చంద్రబాబు నిర్మించేశారన్నట్టు రెండు పేపర్లు, నాలుగు టీవీ చానళ్లు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. చంద్రబాబు హయాంలో, ఇతర ముఖ్యమంత్రుల హయాంలోని ఆర్థిక క్రమశిక్షణ ఎలా ఉందో బుగ్గన సింపుల్‌గా వివరించారు. అప్పులు-ఆస్తుల రేషియోను, రెవెన్యూ లోటును, ఓవర్‌ డ్రాప్ట్‌కు వెళ్లిన తీరును బుగ్గన వివరించారు. అప్పులు-ఆస్తుల శాతంపై బుగ్గన […]

అర్థమయ్యేలా లెక్కలు చెప్పిన బుగ్గన
X

ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల పాలు చేసిన చంద్రబాబు… మీడియాలో మాత్రం తానో గొప్ప నాయకుడిగా ప్రచారం చేయించు కుంటున్నారని పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి మండిపడ్డారు. అమరావతిని చంద్రబాబు నిర్మించేశారన్నట్టు రెండు పేపర్లు, నాలుగు టీవీ చానళ్లు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.

చంద్రబాబు హయాంలో, ఇతర ముఖ్యమంత్రుల హయాంలోని ఆర్థిక క్రమశిక్షణ ఎలా ఉందో బుగ్గన సింపుల్‌గా వివరించారు. అప్పులు-ఆస్తుల రేషియోను, రెవెన్యూ లోటును, ఓవర్‌ డ్రాప్ట్‌కు వెళ్లిన తీరును బుగ్గన వివరించారు.

అప్పులు-ఆస్తుల శాతంపై బుగ్గన చెప్పిన వివరాలు

  • 1994లో ఏపీ అప్పు 100 రూపాయలు ఉంటే… ఆస్తులు విలువ 101 రూపాయిగా ఉండేది.
  • చంద్రబాబు సీఎంగా ఉండగా 2004కు వచ్చే సరికి అప్పు 100 రూపాయలు ఉంటే ఆస్తుల విలువ 45 రూపాయలకు పడిపోయింది.
  • 2004 తర్వాత వైఎస్‌ హయాంలో అప్పు 100 రూపాయలుంటే ఆస్తుల విలువ 103 రూపాయలకు పెరిగింది.
  • విజయభాస్కర్ రెడ్డి హయంలో సర్వీస్‌ రంగంలో పెరుగుదల 7.3 శాతం.
  • చంద్రబాబు హయాంలో సర్వీస్ రంగం వృద్ధి 7శాతం
  • వైఎస్ హయాంలో సర్వీస్ రంగం వృద్ది 9.6 శాతం.

ఓవర్‌ డ్రాప్ట్‌…

  • 2000- 2001లో 9,900 కోట్లు
  • 2001-2002లో 1,100 కోట్లు
  • 2002-03లో 4,200 కోట్లు
  • 2003-4 లో 7,300 కోట్లు

వైఎస్‌ హయాంలో ఒక్క రోజు కూడా ఓడీకి వెళ్లలేదని బుగ్గన వివరించారు.

  • 2009-10లో 33 కోట్లు ఓడీ
  • 2010-11లో 218 కోట్లు ఓడీ
  • 2011-12 జీరో
  • 2012-13జీరో ఓడి
  • 2013-14 జీరో

మళ్ళీ చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి కాగానే…

  • 2014-15లో6వేల 200 కోట్లు ఓడీ
  • 2015-16లో 31వేల కోట్లు ఓడీ
  • 2016-17 లో 29వేల కోట్లు ఓడీకి వెళ్లినట్టు బుగ్గన వివరించారు.

బుగ్గన చెప్పిన రెవెన్యూ లోటు లెక్కలు….

  • చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా 2002-03లో రెవెన్యూ లోటు రూ. 3050 కోట్లు
  • 2003-04 లో మూడు వేల కోట్ల రెవెన్యూ లోటు
  • వైఎస్‌ హయాంలో తొలి ఏడాది 2500 కోట్ల రెవెన్యూ లోటు
  • 2005-06 లో 64 కోట్ల రెవెన్యూ మిగులు
  • 2006-07 లో 2800 కోట్లు మిగులు
  • 2007-08లో 158కోట్లు రెవెన్యూ మిగులు
  • 2008-09 లో వెయ్యి కోట్లు మిగులు
  • 2009-10 లో 1200 కోట్ల మిగులు

ఈ వివరాలను చూస్తే ఎవరు సమర్ధుడైన పరిపాలకుడో అర్థమౌతుంది అన్నారాయన.

First Published:  27 Nov 2018 2:32 AM GMT
Next Story