Telugu Global
Cinema & Entertainment

విజయ్ పై సీరియస్ గా ఉన్న భీమవరం వాసులు

“టాక్సీ వాలా” రిలీజ్ కి ముందే పైరసీ అయిన విషయం తెలిసిందే. అయినా కూడా రిలీజ్ తరువాత మంచి కలెక్షన్స్‌తో నడుస్తోంది. ఇటీవలే భీమవరంలో ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ ని కూడా గ్రాండ్ గా నిర్వహించారు మూవీ యూనిట్. అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ ఈ వేడుక లో విజయ్ మాట్లాడిన తీరుపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొన్నటికి మొన్న “నోటా” రిలీజ్ డేట్ విషయంలో ఎన్టీఆర్ “అరవింద […]

విజయ్ పై సీరియస్ గా ఉన్న భీమవరం వాసులు
X

“టాక్సీ వాలా” రిలీజ్ కి ముందే పైరసీ అయిన విషయం తెలిసిందే. అయినా కూడా రిలీజ్ తరువాత మంచి కలెక్షన్స్‌తో నడుస్తోంది.

ఇటీవలే భీమవరంలో ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ ని కూడా గ్రాండ్ గా నిర్వహించారు మూవీ యూనిట్. అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ ఈ వేడుక లో విజయ్ మాట్లాడిన తీరుపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మొన్నటికి మొన్న “నోటా” రిలీజ్ డేట్ విషయంలో ఎన్టీఆర్ “అరవింద సమేత” రిలీజ్ డేట్ కు వారం రోజుల ముందు అంటూ ట్విట్టర్ లో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. “టాక్సీవాలా” ప్రీరిలీజ్ వేడుకలో పైరసీ చేసే వాళ్లకు ఏకంగా మిడిల్ ఫింగర్ చూపించాడు విజయ్.

అయితే తాజాగా విజయ్ భీమవరం గురించి ప్రస్తావిస్తూ “భీమవరం…. ఎలా ఉన్నారండీ బాబు….”‘ అంటూ విజయ్ ఎటకారంగా మాట్లాడాడంటూ కొందరు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. విజయ్ యాటిట్యూడ్ పై విమర్శలు రావడం ఇదేమి కొత్త కాదు. “అర్జున్ రెడ్డి” చిత్రం నుండీ ఇది మామూలే. ఒక్కోసారి ఒక్కో యాటిట్యూడ్ తో ఇలా విజయ్ వైరల్ అవుతున్నాడు.

First Published:  26 Nov 2018 12:24 AM GMT
Next Story