Telugu Global
Cinema & Entertainment

సినిమా కోసం కథ రాస్తున్న సురేష్ బాబు

ఇటీవల కాలం లో సురేష్ బాబు మంచి కథతో వెళ్ళే చిన్న సినిమా డైరెక్టర్లకు బాగా అవకాశం ఇస్తున్నాడు. “పెళ్లి చూపులు” “c / o కంచరపాలెం” “ఈ నగరానికి ఏమైంది” వంటి సినిమాలు చిన్న సినిమాలుగా రిలీజ్ అయ్యి మంచి వసూళ్ళు రాబట్టాయి. ఇక 2019 లో సురేష్ బాబు ఇలా 9 చిన్న సినిమాలను రిలీజ్ చేయబోతున్నాడట. కాకపోతే ఈ సినిమాలను ముందు ప్రివ్యూలు వేయించుకుని సినిమా నచ్చితేనే రిలీజ్ చేయిస్తున్నాడట. ఇక ఇప్పుడు […]

సినిమా కోసం కథ రాస్తున్న సురేష్ బాబు
X

ఇటీవల కాలం లో సురేష్ బాబు మంచి కథతో వెళ్ళే చిన్న సినిమా డైరెక్టర్లకు బాగా అవకాశం ఇస్తున్నాడు. “పెళ్లి చూపులు” “c / o కంచరపాలెం” “ఈ నగరానికి ఏమైంది” వంటి సినిమాలు చిన్న సినిమాలుగా రిలీజ్ అయ్యి మంచి వసూళ్ళు రాబట్టాయి.

ఇక 2019 లో సురేష్ బాబు ఇలా 9 చిన్న సినిమాలను రిలీజ్ చేయబోతున్నాడట. కాకపోతే ఈ సినిమాలను ముందు ప్రివ్యూలు వేయించుకుని సినిమా నచ్చితేనే రిలీజ్ చేయిస్తున్నాడట.

ఇక ఇప్పుడు “మల్లేశం” అంటూ తెలంగాణ చేనేత కార్మికుడు జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్న సినిమాకి ప్రొడ్యూస్ చేస్తున్నాడు సురేష్ బాబు. ఇకపోతే వచ్చే ఏడాది తన సొంత కథతో మరో సినిమాకి ప్రొడ్యూస్ చేస్తాడట సురేష్ బాబు.

సురేష్ బాబుకి తనకి నచ్చిన ఒక కథని సినిమాగా తెరకేక్కించాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉందట. ఇక వచ్చే ఏడాది తన కథని తెరపైకి తెచ్చే ప్రయత్నంలో సురేష్ బాబు బిజీగా ఉన్నాడట. మరి నిర్మాతగా సక్సెస్ అయిన సురేష్ బాబు రైటర్ గా సక్సెస్ అవుతాడో లేదో చూడాలి.

First Published:  26 Nov 2018 5:14 AM GMT
Next Story