Telugu Global
Cinema & Entertainment

అప్పటి వరకు సినిమాలకు దూరంగా ఉంటాను " శృతి హాసన్

శృతి హాసన్ ని దాదాపు అందరూ హీరోయిన్ గా మర్చిపోయారు. ఎందుకంటే ఈ అమ్మడు సినిమా థియేటర్ లో రిలీజ్ అయి దాదాపు ఏడాది దాటింది. అయితే కేవలం గ్లామర్ పాత్రలు మాత్రమే చెయ్యడం ఇష్టం లేక శృతి హాసన్ సినిమాలు వదిలేసిందట. మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమాలు చేయాలని ఉందని… కానీ అటువంటి అవకాశాలు రావడం లేదని అంటోంది శృతి హాసన్. వరుసగా సినిమాలు తీయక పోవడానికి కారణం ఏంటని అడిగితే…. నటనకు స్కోప్ ఉన్న […]

అప్పటి వరకు సినిమాలకు దూరంగా ఉంటాను  శృతి హాసన్
X

శృతి హాసన్ ని దాదాపు అందరూ హీరోయిన్ గా మర్చిపోయారు. ఎందుకంటే ఈ అమ్మడు సినిమా థియేటర్ లో రిలీజ్ అయి దాదాపు ఏడాది దాటింది.

అయితే కేవలం గ్లామర్ పాత్రలు మాత్రమే చెయ్యడం ఇష్టం లేక శృతి హాసన్ సినిమాలు వదిలేసిందట. మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమాలు చేయాలని ఉందని… కానీ అటువంటి అవకాశాలు రావడం లేదని అంటోంది శృతి హాసన్.

వరుసగా సినిమాలు తీయక పోవడానికి కారణం ఏంటని అడిగితే…. నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని నాకు ఉండదా? అని గట్టిగా జవాబు ఇస్తోంది శృతి హాసన్. కొన్ని సార్లు తప్పక కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ షో చేస్తూ సర్దుకుపోవాల్సి వస్తోందని తన బాధను బయటకు చెప్పింది శృతి హాసన్.

అయితే ప్రస్తుతం తనలోని నటి కంటే కూడా గాయని తనకు ఎక్కువ సంతృప్తిని ఇస్తోందని చెప్పుకుంటుంది శృతి. ప్రతి నాయికలా నేనూ సంపూర్ణ నటిగా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నానని, కేవలం గ్లామర్ షో చేస్తే ప్రేక్షకుల మనసుల్లో ఉండలేము అనే విషయం నాకు కూడా తెలుసు…. అందుకే మంచి పాత్ర దొరికే వరకు సినిమాలకు దూరంగా ఉండాలి అని డిసైడ్ అయ్యాయనిశృతి హాసన్ చెబుతోంది.

ఇక వారసత్వంతో అవకాశం వచ్చినంత మాత్రాన మేము స్టార్‌లు అయినట్లు కాదు…. ఒక సినిమా పూర్తి చేయడానికి ఎంతో కష్టపడాలి…. ఆ శ్రమను కొనసాగిస్తున్నాం కనుకనే నటులుగా ఇంకా ఇండస్ట్రీ లో ఉన్నాం అని తెలిపింది.

First Published:  26 Nov 2018 1:08 AM GMT
Next Story