Telugu Global
National

ప్రపంచకప్ హాకీ పతకానికి భారత్ గురి

43 ఏళ్లుగా ప్రపంచ హాకీ పతకం కోసం నిరీక్షణ భువనేశ్వర్ వేదికగా 28 నుంచి 2018 ప్రపంచకప్ 19రోజులపాటు 16 జట్ల సమరం హాకీ ప్రపంచకప్ లో పతకం కోసం… మాజీ చాంపియన్ భారత్…43 ఏళ్ల నిరీక్షణకు…. భువనేశ్వర్ వేదికగా మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే 2018 ప్రపంచకప్ హాకీ టోర్నీ ద్వారా తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కళింగ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా బుధవారం నుంచి రెండువారాలపాటు సాగే ఈ గ్రూప్ లీగ్ కమ్ నాకౌట్ టోర్నీలో… ఆతిథ్య […]

ప్రపంచకప్ హాకీ పతకానికి భారత్ గురి
X
  • 43 ఏళ్లుగా ప్రపంచ హాకీ పతకం కోసం నిరీక్షణ
  • భువనేశ్వర్ వేదికగా 28 నుంచి 2018 ప్రపంచకప్
  • 19రోజులపాటు 16 జట్ల సమరం

హాకీ ప్రపంచకప్ లో పతకం కోసం… మాజీ చాంపియన్ భారత్…43 ఏళ్ల నిరీక్షణకు…. భువనేశ్వర్ వేదికగా మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే 2018 ప్రపంచకప్ హాకీ టోర్నీ ద్వారా తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కళింగ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా బుధవారం నుంచి రెండువారాలపాటు సాగే ఈ గ్రూప్ లీగ్ కమ్ నాకౌట్ టోర్నీలో… ఆతిథ్య భారత్ 5వ ర్యాంక్ జట్టుగా పతకం వేటకు దిగుతోంది. నవంబర్ 28న జరిగే గ్రూప్ ప్రారంభమ్యాచ్ లో సౌతాఫ్రికాతో భారత్ ఢీ కొనబోతోంది.

భారతజట్టుకు యువరక్తం….

మిడ్ ఫీల్డర్ మన్ ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు ఎక్కువమంది యువఆటగాళ్లతో కూడిన జట్టుతో ప్రత్యర్థులకు సవాలు విసురుతోంది.

1975 ప్రపంచకప్ హాకీలో తొలిసారిగా బంగారు పతకం సాధించిన భారత్… ఆ తర్వాత జరిగిన పది ప్రపంచకప్ టోర్నీల్లో… మొదటి ఐదుస్థానాల్లో ఏనాడూ నిలువలేకపోయింది. అదృష్టం కలసి వస్తే.. ప్రస్తుత 2018 ప్రపంచకప్ టోర్నీ …మొదటి మూడు స్థానాలలో నిలవడం ద్వారా… ఏదో ఒక పతకం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

భారత్ కు డ్రా అనుకూలం…

ప్రపంచకప్ హాకీలో ఆతిథ్య భారత్ కు …గ్రూప్ లీగ్ డ్రా అనుకూలంగా వచ్చింది. బెల్జియం, కెనడా, సౌతాఫ్రికా లాంటి జట్లతో కూడిన పూల్- సీ లీగ్ లో మాజీ చాంపియన్ భారత్ పోటీపడనుంది.

19 రోజులపాటు ప్రపంచకప్…

నవంబర్ 28 నుంచి డిసెంబర్ 16 వరకూ…19 రోజులపాటు జరిగే ..2018 ప్రపంచకప్ హాకీలో మొత్తం… 16 అగ్రశ్రేణిజట్లు తలపడబోతున్నాయి.

అంతర్జాతీయ హాకీలో అత్యుత్తమ ర్యాంకింగ్ జట్లుగా నిలిచిన… ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, జర్మనీ, అర్జెంటీనా, పాకిస్తాన్, మలేసియా, బెల్జియం, భారత్ బరిలోకి దిగుతున్నాయి.

మొత్తం 16 జట్లను… నాలుగు గ్రూపులుగా విభజించి… డ్రా కార్యక్రమాన్ని ఖరారు చేశారు. గ్రూప్ -ఏ లీగ్ లో స్పెయిన్, అర్జెంటీనా, న్యూజిలాండ్, ఫ్రాన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. గ్రూప్ -బీ లీగ్ లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఐర్లాండ్, చైనా పోటీపడతాయి.

గ్రూప్- సీ లీగ్ లో ఆతిథ్య భారత్ తో పాటు… బెల్జియం, సౌతాఫ్రికా, కెనడా జట్లు సమరానికి సై అంటున్నాయి. అంతర్జాతీయ హాకీ ర్యాంకింగ్స్ ప్రకారం…. భారత్ 5వ ర్యాంకులో ఉంటే…. బెల్జియం 3వ ర్యాంక్ జట్టుగా ఉంది. కెనడా 11, సౌతాఫ్రికా 15 ర్యాంకుల్లో ఉన్నా…. భారత్ కు గట్టిపోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

గ్రూప్ ఆఫ్ డెత్….

గ్రూప్ -డీ లో మూడుసార్లు ప్రపంచ చాంపియన్ హాలెండ్, రెండుసార్లు విశ్వవిజేత జర్మనీ, మలేసియా, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే…. గ్రూప్- డీ…. కాస్త…. గ్రూప్ ఆఫ్ డెత్ గా మారింది.

సౌతాఫ్రికాతో తొలి సమరం…

ఆతిథ్య భారతజట్టు… నవంబర్ 28న దక్షిణాఫ్రికాతో ప్రారంభ గ్రూప్ మ్యాచ్ ఆడుతుంది. డిసెంబర్ 2న బెల్జియం, డిసెంబర్ 8న కెనడా జట్లతో తలపడుతుంది. డిసెంబర్ 12, 13 తేదీలలో క్వార్టర్ ఫైనల్స్, డిసెంబర్ 15న సెమీఫైనల్స్, డిసెంబర్ 16న ఫైనల్స్ జరుగుతాయి.

రోజుకు రెండుమ్యాచ్ లు…

మొత్తం 19 రోజులపాటు జరిగే ఈటోర్నీలో రోజుకు రెండుమ్యాచ్ లు చొప్పున నిర్వహిస్తారు. సాయంత్రం 5గంటలకు తొలిమ్యాచ్…..రాత్రి 7 గంటల నుంచి రెండోమ్యాచ్ జరుగుతాయి. ఈ పోటీల కోసం కళింగ ఇంటర్నేషనల్ స్టేడియాన్ని 16వేల సీటింగ్ కెపాసిటీతో సిద్ధం చేశారు.

ప్రపంచహాకీలోనే అతిపెద్ద టోర్నీ ప్రపంచకప్ కు…ఒడిషా ప్రభుత్వం స్పాన్సర్ గా వ్యవహరించడం విశేషం. మస్కట్ వేదికగా ముగిసిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో సంయుక్త విజేతగా నిలిచిన భారత్…. స్థాయికి తగ్గట్టుగా ఆడితే…. ప్రపంచకప్ మొదటి నాలుగు అత్యుత్తమ జట్లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.

First Published:  26 Nov 2018 8:55 AM GMT
Next Story