Telugu Global
NEWS

సుజనా చౌదరిని బీజేపీలో చేర్చాలని చూసిన చంద్రబాబు

చంద్రబాబుకు బినామీగా పేరున్న సుజనాచౌదరి ఆరువేల కోట్లకు బ్యాంకులను ముంచిన వ్యవహారం సంచలనంగా మారింది. నిన్నటి వరకు విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోడీల దోపిడి ప్రస్తావిస్తూ పదేపదే కేంద్రంపై చంద్రబాబు ధ్వజమెత్తుతూ వచ్చారు. ఇప్పుడు తన బినామీగా పేరున్న సుజనాచౌదరి కూడా మాల్యా, నీరవ్‌కు తగ్గకుండానే బ్యాంకులను ముంచేశారు. ఆరువేల కోట్ల రూపాయల మోసానికి సుజనాచౌదరి పాల్పడినట్టు ఈడీ అధికారికంగానే ప్రకటించింది. నిజానికి సుజనా చౌదరి అవినీతి వ్యాపార సామ్రాజ్యం హఠాత్తుగా ఉద్బవించింది కాదు. దశాబ్దకాలంగానే బ్యాంకుల […]

సుజనా చౌదరిని బీజేపీలో చేర్చాలని చూసిన చంద్రబాబు
X

చంద్రబాబుకు బినామీగా పేరున్న సుజనాచౌదరి ఆరువేల కోట్లకు బ్యాంకులను ముంచిన వ్యవహారం సంచలనంగా మారింది. నిన్నటి వరకు విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోడీల దోపిడి ప్రస్తావిస్తూ పదేపదే కేంద్రంపై చంద్రబాబు ధ్వజమెత్తుతూ వచ్చారు.

ఇప్పుడు తన బినామీగా పేరున్న సుజనాచౌదరి కూడా మాల్యా, నీరవ్‌కు తగ్గకుండానే బ్యాంకులను ముంచేశారు. ఆరువేల కోట్ల రూపాయల మోసానికి సుజనాచౌదరి పాల్పడినట్టు ఈడీ అధికారికంగానే ప్రకటించింది. నిజానికి సుజనా చౌదరి అవినీతి వ్యాపార సామ్రాజ్యం హఠాత్తుగా ఉద్బవించింది కాదు.

దశాబ్దకాలంగానే బ్యాంకుల నుంచి అప్పనంగా వేల కోట్ల రుణాలు తీసుకోవడం… వాటిని డమ్మీ కంపెనీల ద్వారా అజ్ఞాతంలోకి మళ్లించడం జరుగుతూనే ఉంది. రెండేళ్ల క్రితమే బ్యాంకుల ఫిర్యాదు మేరకు సీబీఐ మూడు కేసులను నమోదు చేసింది. కానీ అప్పట్లో ఎన్‌డీఏలో కేంద్రమంత్రిగా సుజనా ఉండడంతో వ్యవహారం కేసుల నమోదు వరకే ఆగింది.

వేల కోట్ల మోసం కేసు తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందన్నది సుజనాచౌదరికి, చంద్రబాబుకు తెలియంది కాదు. అందుకే బీజేపీతో టీడీపీ స్నేహం తెంచుకునే సమయంలో సుజనా చౌదరి బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీనిపై అప్పట్లో మీడియాలోనే భారీగానే కథనాలు వచ్చాయి.

వేల కోట్ల అక్రమాలకు పాల్పడిన సుజనా చౌదరి టీడీపీలో కంటే జాతీయ పార్టీ అయిన బీజేపీలో ఉండడం సేఫ్ అని చంద్రబాబునాయుడు కూడా భావించి ఉండవచ్చు. ఇందుకు బలాన్ని ఇచ్చే ఉదాహరణ కూడా ఉంది.

ఓటుకు నోటు కేసులో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయిన రేవంత్ రెడ్డి తనతో ఉంటే ఇబ్బంది అని చెప్పి ఆయనను తెలివిగా కాంగ్రెస్‌లోకి పంపించారు. దాంతో ఓటుకు నోటు కేసులో తనకు కాంగ్రెస్‌ కూడా అండగా ఉండాల్సిన పరిస్థితిని చంద్రబాబు సృష్టించారు.

అవినీతి, ఇతర కేసుల్లో ఇరుకున్న తన వారిని వ్యూహాత్మకంగా చంద్రబాబు జాతీయ పార్టీల్లోకి చొప్పించడం ద్వారా వారికి రక్షణ కవచం ఏర్పాటు చేసి… తద్వారా తనకూ రక్షణ ఉండేలా జాగ్రత్తపడుతుంటారని ఆయన రాజకీయం గురించి తెలిసిన వారు చెబుతుంటారు.

రేవంత్‌ రెడ్డిని కాంగ్రెస్ లోకి పంపించిన తరహాలోనే వేల కోట్ల మేర బ్యాంకులను ముంచిన తన బినామీ సుజనా చౌదరిని బీజేపీలోకి పంపడం ద్వారా ఈ మొత్తం వ్యవహారం బయట పడకుండా చూసేందుకు ప్లాన్ చేశారని చెబుతున్నారు. కానీ సుజనాచౌదరికి బీజేపీలోకి ఎంట్రీ దొరకలేదు. దాంతో ఇబ్బంది వచ్చి పడింది.

ఒకవేళ టీడీపీ పెద్దల వ్యూహం ప్రకారం సుజనా చౌదరికి బీజేపీలో చోటు దొరికి ఉంటే అంతా సేఫ్‌గానే తప్పించుకునే వారు. కానీ బీజేపీలోకి సుజనాకు ఎంట్రీ పాస్ లభించకపోవడం… అదే సమయంలో చంద్రబాబు కాంగ్రెస్‌కు వేల కోట్ల ఫండింగ్‌కు పూనుకోవడంతో బాబు బినామీగా ఉన్న సుజనా చౌదరి అవినీతి సామ్రాజ్యం కంపించడం మొదలైంది.

First Published:  24 Nov 2018 11:50 PM GMT
Next Story