Telugu Global
Cinema & Entertainment

బాలకృష్ణతో రాజమౌళి సినిమా ఆగిపోవడానికి కారణం ఇదేనట!

దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఆర్.ఆర్.ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే “బాహుబలి” సినిమా టైం లో రాజమౌళి కి బాలక్రిష్ణ తో సినిమా చేసే అవకాశం వస్తే వదులుకున్నాడట. అసలు విషయంలోకి వెళ్తే “బాహుబలి” కి ముందు కథా చర్చల్లో పాల్గొన్న సమయంలో శ్రీకృష్ణ దేవరాయలు కథ ఒకటి కొలిక్కి వచ్చిందట. దాంతో ఆ సినిమాని చేయడానికి సిద్దమయ్యాడట రాజమౌళి. అయితే శ్రీకృష్ణ దేవరాయలు కథ అనగానే అది బాలయ్యకు […]

బాలకృష్ణతో రాజమౌళి సినిమా ఆగిపోవడానికి కారణం ఇదేనట!
X

దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఆర్.ఆర్.ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే “బాహుబలి” సినిమా టైం లో రాజమౌళి కి బాలక్రిష్ణ తో సినిమా చేసే అవకాశం వస్తే వదులుకున్నాడట.

అసలు విషయంలోకి వెళ్తే “బాహుబలి” కి ముందు కథా చర్చల్లో పాల్గొన్న సమయంలో శ్రీకృష్ణ దేవరాయలు కథ ఒకటి కొలిక్కి వచ్చిందట. దాంతో ఆ సినిమాని చేయడానికి సిద్దమయ్యాడట రాజమౌళి.

అయితే శ్రీకృష్ణ దేవరాయలు కథ అనగానే అది బాలయ్యకు తప్ప మరొకరికి బాగుండదు…. పైగా అది నేనే బాలయ్య తో చేయాలి అని అన్నాడట దర్శకులు రాఘవేంద్రరావు. సీనియర్ దర్శకులు రాఘవేంద్రరావు రాజమౌళి కి గురువు అన్న విషయం తెలిసిందే.

ఇక ఆయనే స్వయంగా ఆ కథని అడిగారు కాబట్టి సినిమా తీసే ఆలోచనని విరమించుకున్నాడట రాజమౌళి. అందుకే ఆ టైం లో బాలక్రిష్ణ తో సినిమా చేసే అవకాశాన్ని వదులుకొని “బాహుబలి” చేసాడట రాజమౌళి.

First Published:  24 Nov 2018 4:07 AM GMT
Next Story