Telugu Global
Cinema & Entertainment

పాత లుక్ లో కొత్త నాగచైతన్య

సినిమాకు సినిమాకు మధ్య నాగచైతన్య అస్సలు గ్యాప్ ఇవ్వడం లేదని ఈమధ్యే మనం చెప్పుకున్నాం. దాన్ని నిజం చేస్తూ నాగచైతన్య అప్పుడే మరో సినిమాను రెడీ చేశాడు. పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు చైతూ. ఈ లుక్ లో 80ల నాటి కుర్రాడిగా నాగచైతన్య కనిపిస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో చైతూ, సమంత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కొత్త సినిమా స్టిల్ ఇది. భార్యాభర్తల మధ్య వచ్చే చిన్నచిన్న అపోహలతో ఈ […]

పాత లుక్ లో కొత్త నాగచైతన్య
X

సినిమాకు సినిమాకు మధ్య నాగచైతన్య అస్సలు గ్యాప్ ఇవ్వడం లేదని ఈమధ్యే మనం చెప్పుకున్నాం. దాన్ని నిజం చేస్తూ నాగచైతన్య అప్పుడే మరో సినిమాను రెడీ చేశాడు. పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు చైతూ. ఈ లుక్ లో 80ల నాటి కుర్రాడిగా నాగచైతన్య కనిపిస్తున్నాడు.

శివ నిర్వాణ దర్శకత్వంలో చైతూ, సమంత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కొత్త సినిమా స్టిల్ ఇది. భార్యాభర్తల మధ్య వచ్చే చిన్నచిన్న అపోహలతో ఈ సినిమా తెరకెక్కుతోందనే విషయం తెలుసు కానీ, ఇలా 80ల నాటి బ్యాక్ డ్రాప్ కూడా ఉంటుందని ఎవరూ గెస్ చేయలేకపోయారు. ఆ లుక్కే ఇప్పుడు రిలీజైంది.

ప్రస్తుతానికి ఈ సినిమా 40శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. డిసెంబర్ నెలాఖరుకు మిగతా షూటింగ్ కూడా కంప్లీట్ చేసి, ఫిబ్రవరిలో సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. షైన్స్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు.

First Published:  23 Nov 2018 9:05 PM GMT
Next Story