Telugu Global
Cinema & Entertainment

కమల్ హాసన్ భార్యగా కాజల్‌

శంకర్, కమల్‌ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా “భారతీయుడు”. అయితే దాదాపు ఇరవై ఏళ్ళ తరువాత “భారతీయుడు” సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో కమల్ వయసు మళ్ళిన సేనాపతి పాత్రలో కనిపించనున్నాడు. ఆయనకి భార్యగా కాజల్ నటించనుంది. కమల్ హాసన్ భార్య అంటే దాదాపు ఆంటీ పాత్రనే. ఇంకా చెప్పాలి అంటే కొచెం ముసలావిడ లాగ కూడా కనిపించే అవకాశం ఉంది. ఆమె గెటప్ కూడా అలాగే ఉంటుందట. 32 […]

కమల్ హాసన్ భార్యగా కాజల్‌
X

శంకర్, కమల్‌ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా “భారతీయుడు”. అయితే దాదాపు ఇరవై ఏళ్ళ తరువాత “భారతీయుడు” సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో కమల్ వయసు మళ్ళిన సేనాపతి పాత్రలో కనిపించనున్నాడు. ఆయనకి భార్యగా కాజల్ నటించనుంది.

కమల్ హాసన్ భార్య అంటే దాదాపు ఆంటీ పాత్రనే. ఇంకా చెప్పాలి అంటే కొచెం ముసలావిడ లాగ కూడా కనిపించే అవకాశం ఉంది. ఆమె గెటప్ కూడా అలాగే ఉంటుందట. 32 ఏళ్ళు వచ్చినా కాజల్ ఇప్పటికీ యంగ్ గా కనిపిస్తుంది. అందుకే రానా, శర్వానంద్, బెల్లంకొండ శ్రీనివాస్ వంటి యువ హీరోల సరసన కూడా నటిస్తోంది.

అయితే ఇప్పుడు కమల్ సరసన తన ఏజ్ కంటే చాలా పెద్ద వయసులో ఆంటీగా కనిపించాలి. అంటే ఇది కాజల్ కి కొంచెం ఛాలెంజింగ్ పాత్రే అని చేపోచ్చు.

వచ్చే నెలలో కమల్ పై శంకర్ కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నాడు. కానీ కాజల్ అగర్వాల్ మాత్రం వచ్చే ఏడాది జనవరి నుంచి షూటింగ్‌ లో పాల్గొనబోతోంది. లైక ప్రొడక్షన్స్‌ సంస్థ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.

First Published:  24 Nov 2018 12:42 AM GMT
Next Story