Telugu Global
National

టీడీపీ ఎంపీ సుజనా చౌదరిపై ఈడీ మెరుపు దాడులు

టీడీపీ రాజ్యసభ ఎంపీ, బడా పారిశ్రామికవేత్త, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఇంటిపై ఈడీ దాడులు జరిగాయి. ఆయనకు చెందిన నివాసాలు, ఆఫీసుల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. నిన్నటి నుంచే ఈడీ దాడులు జరుగుతున్నాయి.  సమాచారం బయటకు పొక్కకుండా ఈడీ అధికారులు జాగ్రత్తపడ్డారు. సోదాల్లో పలు డాక్యుమెంట్లు, సీడీలు, హార్డ్‌ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితం సుజనా ఇంటిపై ఈడీ దాడులు కూడా జరిగాయి.  అప్పుడు స్వాధీనం చేసుకున్న పత్రాలను పోల్చుకున్న […]

టీడీపీ ఎంపీ సుజనా చౌదరిపై ఈడీ మెరుపు దాడులు
X

టీడీపీ రాజ్యసభ ఎంపీ, బడా పారిశ్రామికవేత్త, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఇంటిపై ఈడీ దాడులు జరిగాయి. ఆయనకు చెందిన నివాసాలు, ఆఫీసుల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. నిన్నటి నుంచే ఈడీ దాడులు జరుగుతున్నాయి. సమాచారం బయటకు పొక్కకుండా ఈడీ అధికారులు జాగ్రత్తపడ్డారు.

సోదాల్లో పలు డాక్యుమెంట్లు, సీడీలు, హార్డ్‌ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితం సుజనా ఇంటిపై ఈడీ దాడులు కూడా జరిగాయి. అప్పుడు స్వాధీనం చేసుకున్న పత్రాలను పోల్చుకున్న అధికారులు మరోసారి దాడులు చేశారు. చెన్నై నుంచి వచ్చిన ఈడీ అధికారుల బృందం ఈ దాడుల్లో పాల్గొంది.

హైదదరాబాద్‌లో ఈ దాడులు జరిగాయి. పంజాగుట్టలోని నాగార్జున హిల్స్ వద్ద ఉన్న బెస్ట్ అండ్ క్రాంప్టన్‌ సంస్థలో సోదాలు జరిగాయి. బ్యాంకులకు వందల కోట్లు ఎగ్గొట్టిన వ్యవహారంలో ఈ దాడులు జరుగుతున్నాయి. 300 కోట్ల రూపాయలను డొల్ల కంపెనీల ద్వారా దారి మళ్లించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే సీబీఐ ఈ వ్యవహారంపై మూడు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసింది. వీటి ఆధారంగానే ఈడీ రంగంలోకి దిగింది.

సుజనా చౌదరికి చెందిన బెస్ట్‌ అండ్ క్రాంప్టన్‌ కంపెనీ మూడు బ్యాంకుల నుంచి వందల కోట్లు అప్పుగా తీసుకుంది. ఈ డబ్బును డొల్ల కంపెనీల ద్వారా మళ్లించేశారు. బ్యాంకులకు రుణం ఎగ్గొట్టింది.

డొల్ల కంపెనీలకు ఉద్యోగులనే డైరెక్టర్లుగా నియమించి నిధులు మాయం చేశారు. నిధులు ఎందుకు చెల్లిస్తున్నారు… ఎందుకు సదరు కంపెనీలకు మళ్లిస్తున్నారు అన్నది కూడా రికార్డుల్లో లేదు. కేవలం నిధులను డొల్ల కంపెనీలకు ప్రవహింప చేశారు.

ఇలా బ్యాంకు రుణాలను డొల్ల కంపెనీలకు దారి మళ్లించి వాటిని సొంత ప్రయోజనాలకు వాడుకున్నారన్నది ఆరోపణ. జూబ్లిహిల్స్‌లో ఉన్న సుజనా ఇంటి పైనా ఈడీ రైడ్‌ చేసింది. సుజనా చౌదరి ఒక మారిషస్‌ బ్యాంకుకు కూడా వందల కోట్లు ఎగవేశారు. ఆ వ్యవహారం ఇప్పుడు కోర్టుల్లో నడుస్తోంది.

First Published:  23 Nov 2018 11:35 PM GMT
Next Story