Telugu Global
Cinema & Entertainment

చంటబ్బాయ్ ను గుర్తుచేసిన ఏజెంట్

కామెడీగా కనిపిస్తూ, నవ్వు తెప్పించే ఏజెంట్ అనగానే ఎవరికైనా చంటబ్బాయ్ గుర్తొస్తాడు. ఆ సినిమాలో ఏజెంట్ గా చిరంజీవి పండించిన హాస్యాన్ని మరిచిపోలేం. మళ్లీ ఇన్నాళ్లకు అలాంటి గూఢచారి తెరపైకి రాబోతున్నాడు. ఇతడి పేరు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. మళ్లీ రావా సినిమాతో ప్రొడక్షన్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టిన స్వధర్మ్ ఎంటర్ టైనర్స్ సంస్థ, తన రెండో ప్రయత్నంగా ఈ కామెడీ గూఢచారి కథను తెరపైకి తీసుకొస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ […]

చంటబ్బాయ్ ను గుర్తుచేసిన ఏజెంట్
X

కామెడీగా కనిపిస్తూ, నవ్వు తెప్పించే ఏజెంట్ అనగానే ఎవరికైనా చంటబ్బాయ్ గుర్తొస్తాడు. ఆ సినిమాలో ఏజెంట్ గా చిరంజీవి పండించిన హాస్యాన్ని మరిచిపోలేం. మళ్లీ ఇన్నాళ్లకు అలాంటి గూఢచారి తెరపైకి రాబోతున్నాడు. ఇతడి పేరు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ.

మళ్లీ రావా సినిమాతో ప్రొడక్షన్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టిన స్వధర్మ్ ఎంటర్ టైనర్స్ సంస్థ, తన రెండో ప్రయత్నంగా ఈ కామెడీ గూఢచారి కథను తెరపైకి తీసుకొస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాకు ప్రచారం స్టార్ట్ చేసింది యూనిట్. ఇందులో భాగంగా తాజాగా టీజర్‌ను రిలీజ్ చేశారు.

స్వరూప్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నవీన్‌ పొలిశెట్టి హీరో. పెద్దగా కేసులు రాకపోయినా, ఏదో ఒకటి కలగజేసుకుని చేధించాలనే కామెడీ ఏజెంట్ గా టీజర్ లో నవీన్ బాగానే ఆకట్టుకున్నాడు. శృతి శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ‘అ!’ సినిమా ఫేం మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నాడు.

First Published:  24 Nov 2018 6:00 AM GMT
Next Story