Telugu Global
NEWS

మా వద్ద కోట్లు లేవు.... తులసీదళం మాత్రమే ఉంది " కోదండరాం

కాంగ్రెస్‌- టీడీపీ- టీజేఎస్‌ కలిసి ఏర్పాటు చేసిన మహాకూటమి గెలుపుకు చంద్రబాబు 500 కోట్లు పంపుతున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు వల్ల మహాకూటమికి సొమ్ము కష్టాలు తీరిపోయాయని చెబుతున్నారు. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాత్రం తమ వద్ద డబ్బులు లేవని చెప్పారు. మేడ్చల్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన కోదండరాం… టీఆర్ఎస్‌ ఎన్నికల్లో కోట్లు వెదజల్లుతోందన్నారు. తమ వద్ద అలా కోట్లు లేవన్నారు. శ్రీకృష్ణుడు తులాభారం వేస్తే తొలుత సత్యభామ వచ్చి సొమ్ములన్నీ […]

మా వద్ద కోట్లు లేవు.... తులసీదళం మాత్రమే ఉంది  కోదండరాం
X

కాంగ్రెస్‌- టీడీపీ- టీజేఎస్‌ కలిసి ఏర్పాటు చేసిన మహాకూటమి గెలుపుకు చంద్రబాబు 500 కోట్లు పంపుతున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు వల్ల మహాకూటమికి సొమ్ము కష్టాలు తీరిపోయాయని చెబుతున్నారు.

టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాత్రం తమ వద్ద డబ్బులు లేవని చెప్పారు. మేడ్చల్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన కోదండరాం… టీఆర్ఎస్‌ ఎన్నికల్లో కోట్లు వెదజల్లుతోందన్నారు.

తమ వద్ద అలా కోట్లు లేవన్నారు. శ్రీకృష్ణుడు తులాభారం వేస్తే తొలుత సత్యభామ వచ్చి సొమ్ములన్నీ గుమ్మరించిందని… కానీ కృష్ణుడు తూగలేదన్నారు. ఆఖరిలో రుక్మిణి వచ్చి తులసీ దళం వేసి శ్రీకృష్ణుడిని గెలుచుకుందని గుర్తు చేశారు.

డబ్బుకు కృష్ణుడే తూగలేదని… ఇప్పుడు ప్రజలు కూడా టీఆర్‌ఎస్‌ డబ్బుకు లొంగుతారని తాము అనుకోవడం లేదన్నారు. తమ వద్ద ఉన్న తులసీదళమే నెగ్గుతుందన్నారు. ప్రజల కోసమే నిలబడతాం…. ప్రజల కోసమే పనిచేస్తామని చెప్పారు. అందుకు చరిత్రే సాక్ష్యమన్నారు కోదండరాం.

First Published:  23 Nov 2018 11:10 AM GMT
Next Story