Telugu Global
NEWS

పాలేకర్‌నూ వాడి పక్కన పడేసిన చంద్రబాబు

ప్రకృతి వ్యవసాయ నిపుణుడు సుభాష్ పాలేకర్‌ ఏపీ సర్కార్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒక విధంగా చంద్రబాబు తనను వాడి వదిలేశారన్న ఆక్రోశంతో ఆయన ఉన్నారు. ఏపీలో ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించే మెగా క్యాంపులకు వచ్చేందుకు ఆయన ససేమిరా అంటున్నారు. బుజ్జగించేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు తనకు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా మోసం చేశారని సుభాష్ పాలేకర్‌ రుసరుసలాడుతున్నారు. మహారాష్ట్రకు చెందిన పాలేకర్‌కు మూడేళ్ల క్రితం చంద్రబాబు రెడ్‌ కార్పెట్‌ పరిచి ఆహ్వానించారు. పాలేకర్‌ను ప్రకృతి వ్యవసాయ […]

పాలేకర్‌నూ వాడి పక్కన పడేసిన చంద్రబాబు
X

ప్రకృతి వ్యవసాయ నిపుణుడు సుభాష్ పాలేకర్‌ ఏపీ సర్కార్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒక విధంగా చంద్రబాబు తనను వాడి వదిలేశారన్న ఆక్రోశంతో ఆయన ఉన్నారు.

ఏపీలో ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించే మెగా క్యాంపులకు వచ్చేందుకు ఆయన ససేమిరా అంటున్నారు. బుజ్జగించేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు తనకు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా మోసం చేశారని సుభాష్ పాలేకర్‌ రుసరుసలాడుతున్నారు.

మహారాష్ట్రకు చెందిన పాలేకర్‌కు మూడేళ్ల క్రితం చంద్రబాబు రెడ్‌ కార్పెట్‌ పరిచి ఆహ్వానించారు. పాలేకర్‌ను ప్రకృతి వ్యవసాయ పితామహుడు అని కీర్తించారు. అమరావతిలో వంద ఎకరాల భూమి ఇచ్చి పాలేకర్‌ చేత ప్రకృతి వ్యవసాయ యూనివర్శిటీ పెట్టిస్తానని… అందుకు వంద కోట్లను కూడా ప్రభుత్వమే కేటాయిస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఇప్పుడు ఆ హామీని నిలుపుకోలేదని పాలేకర్ ఆగ్రహంగా ఉన్నారు. దీనికి తోడు పాలేకర్‌ను చంద్రబాబు పక్కనపడేయడానికి ఆవు కూడా ప్రధాన కారణమని చెబుతున్నారు.

ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ఆవు చాలా ముఖ్యమని పాలేకర్‌ ప్రచారం చేస్తూ వచ్చారు. బీజేపీతో కలిసి ఉన్నన్ని రోజులు చంద్రబాబు కూడా పాలేకర్‌ మాటలకు వంతపాడారు. ఆవులను రైతులకు పంపిణి చేస్తామని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు బీజేపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు రాజకీయంగా ఆలోచన చేస్తున్నారని చెబుతున్నారు.

పాలేకర్ ఆవు వ్యవసాయం బీజేపీ సిద్ధాంతాలకు దగ్గరగా ఉందని… కాబట్టి ఈ నేపథ్యంలో ఆవుతో వ్యవసాయం చేయాలనే పాలేకర్‌ను ప్రోత్సహిస్తే మరో వర్గం ఓటర్లు దూరమవుతారని చంద్రబాబు భావనగా ఉందని పాలేకర్‌ వర్గం విమర్శిస్తోంది.

ఈ వివాదం నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయంపై ఏపీలో నిర్వహించే క్యాంపులకు పాలేకర్ రాకపోతే పరువు పోతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీంతో పాలేకర్‌ను బుజ్జగించేందుకు చంద్రబాబును పలు అంశాలపై ఒప్పించేందుకు ఉన్నతాధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

First Published:  23 Nov 2018 12:18 AM GMT
Next Story