Telugu Global
NEWS

చేతిలో చెప్పు పెట్టి ఓట్లు అడుగుతున్న అభ్యర్థి

తెలంగాణ ఎన్నికల్లో ప్రజలకు దగ్గరయ్యేందుకు… వారిలో నమ్మకాన్ని కలిగించేందుకు అభ్యర్థులు రకరకాల ఫీట్లు వేస్తున్నారు. పకోడిలు వేయడం, బట్టలు ఇస్త్రీ చేయడం, పిల్లలను ఎత్తుకుని లాలించడం వంటివి సాధారణమైపోయాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న హనుమంతరావు మరో అడుగు ముందుకేశారు. ఓటర్ల చేతిలో చెప్పు పెట్టి ఓటు అడుగుతున్నారు. చెప్పుతో పాటు తన రాజీనామా లేఖ కాపీని కూడా ఓటర్లకు ఇస్తున్నారు. కోరుట్ల అభివృద్ధికి అనేక హామీలు ఇస్తున్న హనుమంతరావు తనను గెలిపించాల్సిందిగా […]

చేతిలో చెప్పు పెట్టి ఓట్లు అడుగుతున్న అభ్యర్థి
X

తెలంగాణ ఎన్నికల్లో ప్రజలకు దగ్గరయ్యేందుకు… వారిలో నమ్మకాన్ని కలిగించేందుకు అభ్యర్థులు రకరకాల ఫీట్లు వేస్తున్నారు. పకోడిలు వేయడం, బట్టలు ఇస్త్రీ చేయడం, పిల్లలను ఎత్తుకుని లాలించడం వంటివి సాధారణమైపోయాయి.

జగిత్యాల జిల్లా కోరుట్ల నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న హనుమంతరావు మరో అడుగు ముందుకేశారు. ఓటర్ల చేతిలో చెప్పు పెట్టి ఓటు అడుగుతున్నారు. చెప్పుతో పాటు తన రాజీనామా లేఖ కాపీని కూడా ఓటర్లకు ఇస్తున్నారు.

కోరుట్ల అభివృద్ధికి అనేక హామీలు ఇస్తున్న హనుమంతరావు తనను గెలిపించాల్సిందిగా ఓటర్లను కోరుతున్నారు. ఒకవేళ తాను ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే తాను ఇచ్చిన చెప్పుతోనే కొట్టాల్సిందిగా ఓటర్లను కోరుతున్నారు.

ఈ చెప్పు కాన్సెప్ట్‌తో ఓట్లు ఎన్ని పడుతాయో ఏమో గానీ… ప్రచారం మాత్రం బాగానే వస్తోంది. హనుమంతరావు చెప్పు ప్రచారం టాక్‌ ఆఫ్‌ ది టౌన్ అయింది.

First Published:  23 Nov 2018 12:10 AM GMT
Next Story