Telugu Global
Cinema & Entertainment

మహేష్ బాబు సినిమాలో విలన్ గా సాయి కుమార్

సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25 వ సినిమాని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొన్నటి వరకు అమెరికా లో జరిగింది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక ప్రత్యేక సెట్ లో జరుపనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ గా సీనియర్ హీరో సాయి కుమార్ నటిస్తున్నాడట. ఇప్పుడు ఈ పల్లెటూరి సెట్ లో జరిగే షెడ్యూల్ లో మహేష్ […]

మహేష్ బాబు సినిమాలో విలన్ గా సాయి కుమార్
X

సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25 వ సినిమాని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొన్నటి వరకు అమెరికా లో జరిగింది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక ప్రత్యేక సెట్ లో జరుపనున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ గా సీనియర్ హీరో సాయి కుమార్ నటిస్తున్నాడట. ఇప్పుడు ఈ పల్లెటూరి సెట్ లో జరిగే షెడ్యూల్ లో మహేష్ బాబు, సాయి కుమార్ ల పై సీన్స్ షూట్ చేయనున్నారట మూవీ యూనిట్.

సాయి కుమార్ గతం లో రామ్ చరణ్ హీరోగా నటించిన “ఎవడు” సినిమాలో విలన్ గా నటించాడు. ఆ సినిమాని కూడా వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసాడు. ఇప్పుడు మళ్ళీ సాయి కుమార్ మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమాలో కూడా సాయి కుమార్ నే విలన్ గా పెట్టాడు వంశీ.

దిల్ రాజు, అశ్విని దత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఉగాది కానుకగా రిలీజ్ కానుంది.

First Published:  22 Nov 2018 11:01 PM GMT
Next Story