Telugu Global
NEWS

కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగుల ప్రచారం

బంగారు తెలంగాణ అంటూ గత నాలుగున్నరేండ్లుగా కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పినా…. ఇప్పటికీ కొన్ని వర్గాలు టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగానే ఉన్నాయి. ముఖ్యంగా కౌలు రైతులు, నిరుద్యోగులు కేసీఆర్‌పై గుర్రుగా ఉన్నారు. అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగమని చెప్పిన కేసీఆర్…. ఆ తర్వాత స్టేలు సాకుగా చూపి తూతూ మంత్రంగా ఉద్యోగాల భర్తీ చేపట్టారు. గత నాలుగున్నరేండ్లలో విద్యుత్, నీటి పారుదల రంగాల్లోని ఇంజనీర్ల పోస్టులు.. పోలీసు శాఖలో ఎస్సై, గురుకుల టీచర్ పోస్టులు మినహా […]

కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగుల ప్రచారం
X

బంగారు తెలంగాణ అంటూ గత నాలుగున్నరేండ్లుగా కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పినా…. ఇప్పటికీ కొన్ని వర్గాలు టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగానే ఉన్నాయి. ముఖ్యంగా కౌలు రైతులు, నిరుద్యోగులు కేసీఆర్‌పై గుర్రుగా ఉన్నారు. అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగమని చెప్పిన కేసీఆర్…. ఆ తర్వాత స్టేలు సాకుగా చూపి తూతూ మంత్రంగా ఉద్యోగాల భర్తీ చేపట్టారు. గత నాలుగున్నరేండ్లలో విద్యుత్, నీటి పారుదల రంగాల్లోని ఇంజనీర్ల పోస్టులు.. పోలీసు శాఖలో ఎస్సై, గురుకుల టీచర్ పోస్టులు మినహా మిగతా శాఖల భర్తీలపైపు కన్నెత్తి కూడా చూడలేదు.

రాష్ట్రంలో ఎక్కువ మంది నిరుద్యోగులు ఎదురు చూసేవి టీచర్ పోస్టులే. ఈ ప్రభుత్వం దాదాపు 10 సార్లు డీఎస్సీ నోటిఫికేషన్ అంటూ చెప్పినా ఇంత వరకు ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు. టీఎస్‌పీఎస్‌సీ ద్వారా వచ్చే ప్రతీ నోటిఫికేషన్ కోర్టు మెట్లు ఎక్కి ఆగిపోవడం నిరుద్యోగులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. 2015 జనవరిలో టీచర్ రేషనలైజేషన్ పూర్తి చేసి డీఎస్సీ వేస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. అప్పటికే డీఎస్సీ వేయక ఏడాది గడిచింది. అదే ఏడాది సెప్టెంబర్‌లో 18 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పింది. ఆ తర్వాత పలుమార్లు డీఎస్సీ వేస్తామంటూనే కాలం వెళ్లదీసింది. కాని ఇంత వరకు ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు.

వైద్య, ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పే కేసీఆర్ ప్రభుత్వం ఆ దిశగా చేసిన ప్రయత్నాలు కూడా తక్కువే. ఇప్పటికీ అనేక ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత ఉంది. దాదాపు 20 వేల నర్సింగ్, పారమెడికల్ సిబ్బంది అవసరం. గతంలో స్టాఫ్ నర్సు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి.. పరీక్ష నిర్వహించినా ఇంత వరకు ఆ పోస్టులు భర్తీ చేయలేదు. మరోవైపు ఉస్మానియా, గాంధీ, నీలోఫర్ వంటి ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత ఉందని ఉద్యోగులు ధర్నాలు కూడా చేశారు.

గ్రూప్ 2 పరీక్ష ఫలితాలు వచ్చినా పోస్టింగులు ఇవ్వలేని పరిస్థితి. గ్రూప్ 4 పోస్టులు అయితే భర్తీనే జరగడం లేదు. ఇలా ప్రతీ రంగంలో పోస్టులు ఆశించిన నిరుద్యోగులు నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగులు ఉద్యోగాల భర్తీ కోసం ధర్నాలు చేస్తే అత్యంత నిరంకుశంగా ఈ ప్రభుత్వం అణచి వేసింది.

గత నాలుగున్నర ఏండ్లలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోగా… వారిపై పూర్తి అణచివేత ధోరణిలో వ్యవహరించిన ఈ ప్రభుత్వంపై వారందరూ పూర్తి ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే వివిధ మాధ్యమాల ద్వారా కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆ ప్రభావం ఎన్నికలపై ఎలా ఉంటుందో చూడాలి.

First Published:  23 Nov 2018 12:30 AM GMT
Next Story