Telugu Global
Cinema & Entertainment

హిట్ కోసం నాని పడే పాట్లు వర్క్ అవుట్ అవుతాయా ?

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ రేస్ లో వెనకబడి ఉన్నాడు. నాని నుంచి ఈ ఏడాది వచ్చిన “కృష్ణార్జున యుద్ధం” ఫ్లాప్ గా నిలువగా “దేవదాస్” మాత్రం బిలో యావరేజ్ గా నిలిచింది. ఇవే కాకుండా నాని గతం లో చేసిన “ఎం.సి.ఏ”, “నేను లోకల్” వంటి సినిమాలకు మంచి కలెక్షన్సే వచ్చినా…. నాని నటనకు చెప్పుకోదగ్గ హిట్స్ అయితే కావు. పైగా “బిగ్ బాస్ 2” వల్ల నానికి ప్రేక్షకుల నుంచి బాగా […]

హిట్ కోసం నాని పడే పాట్లు వర్క్ అవుట్ అవుతాయా ?
X

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ రేస్ లో వెనకబడి ఉన్నాడు. నాని నుంచి ఈ ఏడాది వచ్చిన “కృష్ణార్జున యుద్ధం” ఫ్లాప్ గా నిలువగా “దేవదాస్” మాత్రం బిలో యావరేజ్ గా నిలిచింది.

ఇవే కాకుండా నాని గతం లో చేసిన “ఎం.సి.ఏ”, “నేను లోకల్” వంటి సినిమాలకు మంచి కలెక్షన్సే వచ్చినా…. నాని నటనకు చెప్పుకోదగ్గ హిట్స్ అయితే కావు. పైగా “బిగ్ బాస్ 2” వల్ల నానికి ప్రేక్షకుల నుంచి బాగా వ్యతిరేకత వచ్చింది. దీంతో ఈ సారి ఎలాగైనా ఒక హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి రావాలని నాని అనుకుంటున్నాడు.

అందుకే తన తదుపరి సినిమా అయిన “జెస్సి” మీద ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నాడు నాని. ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని…. కేవలం ఒక్క షెడ్యూల్ లో సినిమాని పూర్తీ చేయాలని భావిస్తున్నాడు.

ఎందుకంటే అలా ఒక్క షెడ్యూల్ లో సినిమాని పూర్తీ చేస్తే అప్పుడు సినిమా బడ్జెట్ తగ్గుతుంది అలాగే సినిమా పై మంచి పాజిటివ్ పబ్లిసిటీ కూడా వస్తుంది అనేది నాని ప్లాన్. గౌతం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు.

First Published:  23 Nov 2018 12:53 AM GMT
Next Story