Telugu Global
Cinema & Entertainment

హిట్టు కోసం ఆ డైరెక్టర్ నే నమ్ముకున్న గోపీచంద్

పక్కా కమర్షియల్ హీరో అయిన గోపీచంద్ ప్రస్తుతం హిట్స్ లేక సతమతమవుతున్నాడు. గోపీచంద్ నుంచి వచ్చిన చివరి చిత్రం “పంతం”. చక్రి అనే కొత్త కుర్రాడిని డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేస్తూ పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాని చేశాడు గోపీచంద్. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో తనకి ఎలాగైనా హిట్ అవసరం అని గ్రహించిన గోపీచంద్ తనతో సినిమాలు చేసి హిట్స్ ఇచ్చిన […]

హిట్టు కోసం ఆ డైరెక్టర్ నే నమ్ముకున్న గోపీచంద్
X

పక్కా కమర్షియల్ హీరో అయిన గోపీచంద్ ప్రస్తుతం హిట్స్ లేక సతమతమవుతున్నాడు. గోపీచంద్ నుంచి వచ్చిన చివరి చిత్రం “పంతం”. చక్రి అనే కొత్త కుర్రాడిని డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేస్తూ పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాని చేశాడు గోపీచంద్. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

అయితే ఇలాంటి పరిస్థితుల్లో తనకి ఎలాగైనా హిట్ అవసరం అని గ్రహించిన గోపీచంద్ తనతో సినిమాలు చేసి హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ నే నమ్ముకున్నాడు. ఆ డైరెక్టర్ మరెవరో కాదు ఇటివలే “సాక్ష్యం” సినిమాతో యావరేజ్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న శ్రీవాస్.

గతంలో శ్రీవాస్, గోపీచంద్ కాంబినేషన్ లో “లక్ష్యం” “లౌక్యం” అనే సినిమాలు వచ్చి పెద్ద హిట్స్ గా నిలిచాయి. సో ఇప్పుడు ఈ ఇద్దరికీ ఒక మంచి హిట్ కావలి అంటే ఇద్దరు ఏకమై ఒక సినిమా చేయాలి. అందుకే గోపీచంద్ కోసం ఒక పవర్ ఫుల్ కథని రెడీ చేసే పనిలో శ్రీవాస్ ఉన్నట్టు తెలుస్తోంది. గోపీచంద్ కూడా ప్రస్తుతం ఏ ఒక్క సినిమా కూడా ఒప్పుకోకుండా శ్రీవాస్ ఎలాంటి కథతో ముందుకి వస్తాడా అని ఎదురు చూస్తున్నాడు.

First Published:  23 Nov 2018 3:09 AM GMT
Next Story