Telugu Global
Cinema & Entertainment

వరుణ్ తేజ్ మాట దిల్ రాజు వింటాడా?

వచ్చే ఏడాది సంక్రాంతికి రామ్ చరణ్ హీరో గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న “వినయ విధేయ రామ” రిలీజ్ కానుంది. ఈ సినిమాతో పాటు వరుణ్ తేజ్, విక్టరీ వెంకటేష్ మల్టీ స్టారర్స్ గా వస్తున్న “ఎఫ్ 2” కూడా రిలీజ్ కానుంది. అయితే తన సినిమా రామ్ చరణ్ సినిమాతో పోటీ పడి రిలీజ్ కావడం వరుణ్ తేజ్ కి అస్సలు ఇష్టం లేదట. మెగా అభిమానుల ఆదరణ పూర్తిగా పొందాలంటే కాస్త గ్యాప్ […]

వరుణ్ తేజ్ మాట దిల్ రాజు వింటాడా?
X

వచ్చే ఏడాది సంక్రాంతికి రామ్ చరణ్ హీరో గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న “వినయ విధేయ రామ” రిలీజ్ కానుంది. ఈ సినిమాతో పాటు వరుణ్ తేజ్, విక్టరీ వెంకటేష్ మల్టీ స్టారర్స్ గా వస్తున్న “ఎఫ్ 2” కూడా రిలీజ్ కానుంది.

అయితే తన సినిమా రామ్ చరణ్ సినిమాతో పోటీ పడి రిలీజ్ కావడం వరుణ్ తేజ్ కి అస్సలు ఇష్టం లేదట. మెగా అభిమానుల ఆదరణ పూర్తిగా పొందాలంటే కాస్త గ్యాప్ తీసుకోవడం అవసరమని, “ఎఫ్ 2” ను జనవరి 25వ తేదీన విడుదల చేయడం మంచిదని దిల్ రాజుతో చెప్పాడట వరుణ్ తేజ్.

కానీ ఒక నిర్మాతగా దిల్ రాజు నిర్ణయం అనేక లావాదేవీలతో ముడిపడి ఉంటుంది. కాబట్టి దిల్ రాజు ఏమీ చెప్పలేదని తెలుస్తోంది. మరి దిల్ రాజు నో అని చెప్తే వరుణ్ తేజ్ ఏం చేస్తాడో చూడాలి. ఒకవేళ సంక్రాంతి బరి నుంచి “ఎఫ్ 2” తప్పుకుంటే మాత్రం “మిస్టర్ మజ్ను” బరిలోకి దిగే అవకాశం ఉంది.

First Published:  23 Nov 2018 6:14 AM GMT
Next Story