Telugu Global
Cinema & Entertainment

"24 కిస్సెస్" సినిమా రివ్యూ

రివ్యూ: 24 కిస్సెస్ రేటింగ్‌: 1/5 తారాగణం: ఆదిత్ అరుణ్, హెబ్బా పటేల్, నరేష్, రావు రమేష్  తదితరులు సంగీతం:  జాయ్ బారువా నిర్మాత:  సంజయ్ రెడ్డి, అనిల్, అయోధ్య కుమార్ దర్శకత్వం: అయోధ్య కుమార్ ఒక న్యూస్ ఛానల్ లో డిబేట్ జరిగే దాకా 24 కిస్సెస్ అనే సినిమా ఒకటి వస్తోందని జనానికి తెలియలేదు. కుమారి 21ఎఫ్ తో గుర్తింపు తెచ్చుకున్న హెబ్బా పటేల్ తప్ప ఇందులో ఏ అంశము జనాన్ని థియేటర్ దాకా రప్పించేది కాకపోవడంతో పబ్లిసిటీని నెగటివ్ గా ప్లాన్ చేసి […]

24 కిస్సెస్ సినిమా రివ్యూ
X

రివ్యూ: 24 కిస్సెస్
రేటింగ్‌: 1/5
తారాగణం: ఆదిత్ అరుణ్, హెబ్బా పటేల్, నరేష్, రావు రమేష్ తదితరులు
సంగీతం: జాయ్ బారువా
నిర్మాత: సంజయ్ రెడ్డి, అనిల్, అయోధ్య కుమార్
దర్శకత్వం: అయోధ్య కుమార్

ఒక న్యూస్ ఛానల్ లో డిబేట్ జరిగే దాకా 24 కిస్సెస్ అనే సినిమా ఒకటి వస్తోందని జనానికి తెలియలేదు. కుమారి 21ఎఫ్ తో గుర్తింపు తెచ్చుకున్న హెబ్బా పటేల్ తప్ప ఇందులో ఏ అంశము జనాన్ని థియేటర్ దాకా రప్పించేది కాకపోవడంతో పబ్లిసిటీని నెగటివ్ గా ప్లాన్ చేసి ఓపెనింగ్స్ కి గేలం వేసిన ఈ మూవీకి కొంత పాజిటివ్ కార్నర్ రావడానికి కారణం మొన్న లైవ్ షోలో జరిగిన రచ్చే. ఆ సంగతి అలా ఉంచితే ముద్దులే టైటిల్ గా పెట్టారు కాబట్టి యూత్ నైనా ఇది మెప్పించిందా లేక మొత్తంగా బోల్తా కొట్టిందా? త్వరలో తేలిపోతుంది.

ఆనంద్ కుమార్ (ఆదిత్ అరుణ్) అనే ఫిలిం మేకర్ కు అమ్మాయిలంటే పిచ్చి. పెళ్లి, పిల్లలు అంటే చులకన భావం. శ్రీలక్ష్మి(హెబ్బా పటేల్)కి ఇతనిలో ఈ కోణం తెలియక అమాయకంగా ప్రేమించేస్తుంది. దొరికినప్పుడంతా ముద్దులు ఇచ్చేస్తుంటుంది. కట్ చేస్తే ఓ మంచి ముహూర్తంలో అబ్బాయి గారికి రాసలీలలు ఉన్నాయని తెలిసి ఛీ కొడుతుంది. దీంతో తన గోడుని సైకాలజి డాక్టర్ మూర్తి (రావు రమేష్)దగ్గర వెళ్లబోసుకుంటాడు ఆనంద్. ఇద్దరు విడిపోయాక ఈ ప్రేమ కథ ఏ తీరం చేరింది, ఒక్కటయ్యారా లేదా అనేది మీ ఊహకు సులభంగా అందేదే.

అరుణ్ ఆదిత్ నటుడిగా ఇంకా అప్ కమింగ్ స్టేజి లో ఉన్నాడు. ఎక్స్ ప్రెషన్స్ పరంగా, యాక్టింగ్ పరంగా ఇప్పుడున్న హీరోలతో పోలిస్తే మెరుగ్గానే కనిపిస్తాడు. తన టాలెంట్ కు తగ్గ కథ దొరికితే మాత్రం ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది. ఇందులో కూడా బాగానే చేసాడు. హెబ్బా పటేల్ యాక్టింగ్ ఓకే. ముద్దులు శుభ్రంగా ఇచ్చేసింది. సీనియర్ నరేష్ హీరోయిన్ తండ్రిగా చిన్న పాత్రే. ఇంకెవరూ ఇందులో గుర్తుండరు

పోస్టర్లో ట్రైలర్ లో ముద్దులు పెట్టిస్తే చాలు జనం పొలోమని వచ్చేస్తారని ఎలా అనుకుంటారో తెలియదు కానీ ఈ ట్రెండ్ గత రెండేళ్ల నుంచి ఉధృతంగా సాగుతోంది. అవసరం ఉన్నా లేకపోయినా ముద్దులని కథలో భాగంగా ఇరికించేసి యూత్ ద్వారా వసూళ్లు రాబట్టుకోవాలని చూస్తున్న దర్శకుల అతి తెలివికి చెల్లుబాటు రోజులు వచ్చేసాయి. కంటెంట్ ఉంటే తప్ప మేము ఆదరించం అని ప్రేక్షకులు నెత్తి నోరు బాదుకున్నా వినిపించుకునే స్థితిలో లేనప్పుడు ఇలాంటి సినిమాలే వస్తాయి.

దర్శకుడు అయోధ్య కుమార్ ఇలాంటి కథను ఎన్నుకోవడం విడ్డూరంగా అనిపిస్తుంది. విపరీతమైన నెమ్మది తనంతో సాగే కథలో చాలా అయోమయాన్ని నింపేసిన దర్శకుడు ఏ పాత్రనూ ఆసక్తికరంగా రాసుకోలేకపోవడం అసలు మైనస్. పైగా ముద్దుల కోసం ఇరికించిన ట్రాక్స్ అన్నీ తేడా కొట్టాయి. ఒకదశలో ఇన్ని ముద్దులు ఎందుకు అన్న అసహనం కూడా కలుగుతుంది.

మొత్తానికి అయోధ్య కుమార్ తన మీద పెట్టుకున్న కనీస అంచనాలు కూడా అందుకోలేకపోయాడు. జాయ్ బారువా సంగీతం యావరేజ్. పెద్దగా ఆకట్టుకునేలా లేదు. ఉదయ్ కెమెరా బెటర్ గా ఉంది. ఎడిటింగ్ మాత్రం తేడా కొట్టింది. లో బడ్జెట్ కాబట్టి నిర్మాణ విలువలు గురించి చెప్పడానికి ఏమి లేదు.

24 కిస్సెస్ పేరుని చూసి దర్శకుడి మొదటి సినిమాను నమ్మి ఏవేవో ఊహించుకుంటే మాత్రం మొత్తంగా దెబ్బ కొడుతుందీ సినిమా. విరుద్ధ భావాలు కలిగిన ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య ప్రేమ కథను సున్నితంగా డీల్ చేయడం వదిలేసి అనవసర ప్రహసనాలతో ప్రేక్షకుల ఓపికతో ఆడుకోవడంతో రెండిటి చెడ్డ రేవడిలా ఎవరిని మెప్పించలేక ఫైనల్ గా మరో యూత్ ఫుల్ డిజాస్టర్ ఖాతాలో చేరిపోయేలా ఉంది.

First Published:  23 Nov 2018 6:41 AM GMT
Next Story