Telugu Global
National

అనూహ్యంగా అసెంబ్లీ రద్దు చేసిన గవర్నర్

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ రద్దయింది. అనూహ్యంగా గవర్నర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో పీడీపీ-బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం జూన్‌ 19న కుప్పకూలింది. అప్పటి నుంచి అక్కడ రాష్ట్రపతి పాలనే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పీడీపీ- కాంగ్రెస్‌, నేషనల్ కాన్ఫరెన్స్‌లు కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాయి. పీడీపీ కూడా రాజ్‌భవన్‌కు ఈ విషయాన్ని తెలియజేసింది. ఇంతలో బీజేపీ, 18 మంది ఇతరుల మద్దతుతో తాను కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలనని పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ […]

అనూహ్యంగా అసెంబ్లీ రద్దు చేసిన గవర్నర్
X

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ రద్దయింది. అనూహ్యంగా గవర్నర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో పీడీపీ-బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం జూన్‌ 19న కుప్పకూలింది. అప్పటి నుంచి అక్కడ రాష్ట్రపతి పాలనే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పీడీపీ- కాంగ్రెస్‌, నేషనల్ కాన్ఫరెన్స్‌లు కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాయి.

పీడీపీ కూడా రాజ్‌భవన్‌కు ఈ విషయాన్ని తెలియజేసింది. ఇంతలో బీజేపీ, 18 మంది ఇతరుల మద్దతుతో తాను కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలనని పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ నేత సజ్జాద్‌ లోన్‌ ముందుకు వచ్చారు. ఇలా రెండు వర్గాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పోటీకి దిగాయి. ఇంతలోనే అసెంబ్లీని రద్దు చేస్తున్నట్టు గవర్నర్ ప్రకటించారు.

కాంగ్రెస్‌- పీడీపీ- ఎన్సీ కూటమి ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకునేందుకే బీజేపీ కనుసన్నల్లో గవర్నర్ అసెంబ్లీని రద్దు చేశారన్న విమర్శలు వస్తున్నాయి. అయితే రాజ్‌భవన్‌ మాత్రం…. భిన్న సిద్ధాంతాలు, వైరుధ్యాలు ఉన్న పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటున్నాయని… సదరు కూటమి వల్ల ప్రభుత్వ సుస్థితర సాధ్యం కాదని భావించే గవర్నర్ అసెంబ్లీని రద్దు చేశారని రాజ్‌భవన్ చెబుతోంది.

పీడీపీకి 28 మంది, కాంగ్రెస్‌కు 12 మంది, ఎన్‌సీకి 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కూటమి ఏర్పాటుకు 44 మంది సభ్యుల బలం కావాల్సి ఉండగా కూటమికి ప్రస్తుతం 55 మంది సభ్యుల బలం ఉంది.

జమ్మూకశ్మీర్‌లో రెండో అతిపెద్దపార్టీగా ఉన్న బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.

First Published:  21 Nov 2018 8:20 PM GMT
Next Story