Telugu Global
Cinema & Entertainment

మారుతికి రాయల్టీ అందేసింది

పైకి పెద్దగా కనిపించని వివాదం ఒకటి మొన్నటివరకు ఇండస్ట్రీలో నడిచింది. అన్నీతానై గతంలో మారుతి ప్రేమకథా చిత్రమ్ తీసిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ వస్తోంది. అయితే తన ప్రమేయం లేకుండా, తనకు చెప్పకుండా సీక్వెల్ తీయడంపై మారుతి మండిపడ్డాడు. అది గ్రంథచౌర్యం కిందకు వస్తుందని ఆరోపించాడు. ఈ మేటర్ ను ఆర్పీఏ క్రియేషన్స్ నిర్మాతలు సెటిల్ చేశారు. మారుతికి కొంత మొత్తం ఇచ్చి మేటర్ ను సెటిల్ చేశారు. నిజానికి ప్రేమకథాచిత్రమ్ సీక్వెల్ […]

మారుతికి రాయల్టీ అందేసింది
X
పైకి పెద్దగా కనిపించని వివాదం ఒకటి మొన్నటివరకు ఇండస్ట్రీలో నడిచింది. అన్నీతానై గతంలో మారుతి ప్రేమకథా చిత్రమ్ తీసిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ వస్తోంది. అయితే తన ప్రమేయం లేకుండా, తనకు చెప్పకుండా సీక్వెల్ తీయడంపై మారుతి మండిపడ్డాడు. అది గ్రంథచౌర్యం కిందకు వస్తుందని ఆరోపించాడు.
ఈ మేటర్ ను ఆర్పీఏ క్రియేషన్స్ నిర్మాతలు సెటిల్ చేశారు. మారుతికి కొంత మొత్తం ఇచ్చి మేటర్ ను సెటిల్ చేశారు. నిజానికి ప్రేమకథాచిత్రమ్ సీక్వెల్ కు సంబంధించి మారుతికి ఎలాంటి రాయల్టీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సినిమాపై సర్వహక్కులు నిర్మాతకు ఉంటాయి. కావాలంటే ఆ కథకు కొనసాగింపుగా 2-3 సీక్వెల్స్ కూడా తీసుకోవచ్చు. ఏ దర్శకుడ్ని అయినా పెట్టుకోవచ్చు.
కానీ మారుతితో వ్యవహారం చెడకూడదనే ఉద్దేశంతోనే సదరు నిర్మాతలు తెరవెనక మేటర్ ను సెటిల్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ వివాదంలో మారుతికి ఎంత ముట్టిందనేది ఇంకా బయటకు రాలేదు.
First Published:  22 Nov 2018 6:44 AM GMT
Next Story