Telugu Global
NEWS

తుమ్మ‌ల‌ గెలుపు డౌటే!

ఖ‌మ్మం రాజకీయాల్లో ఇప్పుడు పాలేరు నియోజ‌క‌వ‌ర్గం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఉప ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి గెలిచిన టీఆర్ఎస్ అభ్య‌ర్థి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుకి ఇప్పుడు టెన్ష‌న్ మొద‌లైంది. కాంగ్రెస్ అభ్య‌ర్థి ఉపేంద‌ర్ రెడ్డి ధీటైన ప్ర‌చారంతో గులాబీ వ‌ర్గం ఆందోళ‌న చెందుతోంది. ముఖ్యంగా ఉపేంద‌ర్‌రెడ్డి లేవ‌నెత్తుతున్న లోక‌ల్ నినాదం తుమ్మ‌ల‌కు నిద్ర‌ప‌ట్ట‌నివ్వ‌డం లేదు. తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుది స‌త్తుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం. ఆ సీటు రిజ‌ర్వ్‌డ్‌. దీంతో ఆయ‌న ఖ‌మ్మం నుంచి 2014 ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. ఓడిపోయారు. అయితే ఆతర్వాత […]

తుమ్మ‌ల‌ గెలుపు డౌటే!
X

ఖ‌మ్మం రాజకీయాల్లో ఇప్పుడు పాలేరు నియోజ‌క‌వ‌ర్గం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఉప ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి గెలిచిన టీఆర్ఎస్ అభ్య‌ర్థి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుకి ఇప్పుడు టెన్ష‌న్ మొద‌లైంది. కాంగ్రెస్ అభ్య‌ర్థి ఉపేంద‌ర్ రెడ్డి ధీటైన ప్ర‌చారంతో గులాబీ వ‌ర్గం ఆందోళ‌న చెందుతోంది. ముఖ్యంగా ఉపేంద‌ర్‌రెడ్డి లేవ‌నెత్తుతున్న లోక‌ల్ నినాదం తుమ్మ‌ల‌కు నిద్ర‌ప‌ట్ట‌నివ్వ‌డం లేదు.

తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుది స‌త్తుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం. ఆ సీటు రిజ‌ర్వ్‌డ్‌. దీంతో ఆయ‌న ఖ‌మ్మం నుంచి 2014 ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. ఓడిపోయారు. అయితే ఆతర్వాత టీఆర్ఎస్‌లో చేర‌డం… మంత్రి కావ‌డం జ‌రిగిపోయింది. పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంక‌ట‌రెడ్డి మ‌ర‌ణంతో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు గెలిచారు. మ‌రోసారి పాలేరు నుంచి గెలిచేందుకు తుమ్మ‌ల తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు.

ఒక వైపు ఆయ‌న లోక‌ల్‌ కాక‌పోవ‌డం…. ఎమ్మెల్యేగా ఎన్నికైన త‌ర్వాత ఆయ‌న చేసేందేమి లేక‌పోవ‌డంతో జ‌నం నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్నారు. సొంత సామాజిక‌వ‌ర్గం కూడా ఇప్పుడు తుమ్మ‌ల‌కు అనుకున్నంత స‌హ‌క‌రించ‌డం లేద‌ని తెలుస్తోంది. కూట‌మి రాజ‌కీయాలతో కాంగ్రెస్ వైపు తుమ్మ‌ల సామాజికవ‌ర్గం చూస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు గులాబీలోనే మ‌రో వ‌ర్గం కూడా తుమ్మ‌ల‌ను ఓడించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోట. 1999 నుంచి 2014 వరకు ఇక్కడ ఆ పార్టీ తిరుగులేని విజయాలు సాధించింది. ఈ ఎన్నిక‌ల్లో కందాళ ఉపేందర్‌ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాత్మకంగా బరిలోకి దింపింది. పాలేరులో సీపీఐ, తెలుగుదేశం పార్టీ శ్రేణులు దశాబ్దాలుగా బలంగా ఉన్నాయి. సంప్రదాయ ఓటుబ్యాంకులు కూడా వాటికి ఉన్నాయి. ఆ రెండు పార్టీలు కలిసికట్టుగా ఉపేందర్‌ రెడ్డి విజయానికి కృషి చేస్తున్నాయి. మూడు పార్టీలు సమన్వయంతో పనిచేస్తుండడం తుమ్మలకు, టిఆర్ఎస్ పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

కాంట్రాక్ట‌ర్‌గా, ప్రజా సేవకుడిగా ఎలాంటి పదవి లేకుండానే నియోజకవర్గంలో సేవాకార్యక్రమాల ద్వారా ఉపేందర్‌ రెడ్డి అక్కడి ప్రజల అభిమానం సంపాదించుకున్నారు. ఒక కాంట్రాక్ట‌ర్‌గా ఎన్నో ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టుల‌ను ఆయ‌న పూర్తి చేశారు. నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయకపోయినా రెండు దశాబ్దాలుగా నియోజకవర్గ ప్రజలతో ఉపేందర్‌ రెడ్డికి సంబంధాలున్నాయి. ఆయన తుమ్మలకు దీటుగా, దూకుడుగా వెళ్తుండడంతో టిఆర్ఎస్ అభ్యర్థి కాకలు తీరిన తుమ్మల నాగేశ్వరరావు నిద్రలేని రాత్రులు గడపవలసి వస్తున్నట్టు కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు.

First Published:  21 Nov 2018 11:57 PM GMT
Next Story