Telugu Global
Cinema & Entertainment

దర్శకత్వం చేస్తానంటున్న మెగా స్టార్

మెగా స్టార్ చిరంజీవి తన ఫైట్స్ తో డాన్స్ లతో నటనతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇదిలా ఉంటే ఇన్నేళ్ళ తన కెరీర్ లో మెగా స్టార్ కేవలం నటనకి మాత్రమే పరిమితం అయ్యి అభిమానులని సంతృప్తిపరుస్తూ వస్తున్నాడు. అయితే కెరీర్ లో మొట్ట మొదటి సారి దర్శకత్వం చేయాలి అని డిసైడ్ అయ్యాడు అంట మెగా స్టార్. అసలైతే చిరంజీవికి ఎప్పటి నుంచో డైరెక్టర్ అవ్వాలి అనేది ఆశగా ఉంది అంట, […]

దర్శకత్వం చేస్తానంటున్న మెగా స్టార్
X

మెగా స్టార్ చిరంజీవి తన ఫైట్స్ తో డాన్స్ లతో నటనతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇదిలా ఉంటే ఇన్నేళ్ళ తన కెరీర్ లో మెగా స్టార్ కేవలం నటనకి మాత్రమే పరిమితం అయ్యి అభిమానులని సంతృప్తిపరుస్తూ వస్తున్నాడు. అయితే కెరీర్ లో మొట్ట మొదటి సారి దర్శకత్వం చేయాలి అని డిసైడ్ అయ్యాడు అంట మెగా స్టార్.

అసలైతే చిరంజీవికి ఎప్పటి నుంచో డైరెక్టర్ అవ్వాలి అనేది ఆశగా ఉంది అంట, కానీ తనకి ఉన్న స్టార్ స్టేటస్ వల్ల అది సాధ్యపడలేదు. కానీ ఇప్పుడు మాత్రం అది సాధ్యపడేలా చేస్తున్నాడు మెగా స్టార్. ప్రస్తుతం తనకి ఉన్న కమిట్మెంట్స్ అన్ని పూర్తయ్యాక ఒక సినిమాని డైరెక్ట్ చేస్తాడు అంట మెగా స్టార్. మొన్నామధ్య “సై రా” సెట్స్ కి సురేందర్ రెడ్డి లేట్ గా వస్తే టైం ఎందుకు వేస్ట్ చెయ్యడం అని చిరంజీవే స్వయంగా ఒక సీన్ ని డైరెక్ట్ చేసాడు అంట. అక్కడే తనకి అర్ధం అయ్యింది అంట తను కూడా దర్శకత్వం చెయ్యగలడు అని. ఇకపోతే రామ్ చరణ్ నిర్మాణంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సై రా” వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ కానుంది.

First Published:  22 Nov 2018 1:22 AM GMT
Next Story