Telugu Global
Cinema & Entertainment

రైల్వే క్లర్క్ గా సమంతా

సమంతా అక్కినేని ఇండస్ట్రీ కి వచ్చి దాదాపు పదేళ్ళు అవుతుంది. ఇన్నేళ్ళ సినీ జీవితంలో సమంతా చాలా విలక్షణమైన పాత్రలు పోషించింది. ఈ ఏడాది “మహానటి” “రంగస్థలం” తో తనలోని నటనా కౌశల్యాన్ని ప్రదర్శించింది సమంతా. ఇదిలా ఉంటే ప్రస్తుతం సమంతా నాగ చైతన్యతో “మజిలి” అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో సమంతా రైల్వే క్లర్క్ పాత్రలో నటిస్తుంది. ఇటివలే జరిగిన రైల్వే స్టేషన్ షూటింగ్ లో సమంతా రైల్వే క్లర్క్ గా ఉన్న సీన్స్ […]

రైల్వే క్లర్క్ గా సమంతా
X

సమంతా అక్కినేని ఇండస్ట్రీ కి వచ్చి దాదాపు పదేళ్ళు అవుతుంది. ఇన్నేళ్ళ సినీ జీవితంలో సమంతా చాలా విలక్షణమైన పాత్రలు పోషించింది. ఈ ఏడాది “మహానటి” “రంగస్థలం” తో తనలోని నటనా కౌశల్యాన్ని ప్రదర్శించింది సమంతా. ఇదిలా ఉంటే ప్రస్తుతం సమంతా నాగ చైతన్యతో “మజిలి” అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో సమంతా రైల్వే క్లర్క్ పాత్రలో నటిస్తుంది. ఇటివలే జరిగిన రైల్వే స్టేషన్ షూటింగ్ లో సమంతా రైల్వే క్లర్క్ గా ఉన్న సీన్స్ ని షూట్ చేసారు అంట మూవీ యూనిట్.

ప్రస్తుతం ఈ సినిమా యొక్క షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది. అక్కడ ఒక వారం రోజులు షూటింగ్ జరిపాక మళ్ళి హైదరబాద్ కి షూటింగ్ మారుస్తారు మూవీ యూనిట్. పెళ్ళి తరువాత నాగ చైతన్య, సమంతా కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై అందరిలో ఆసక్తి నెలకొంది. “నిన్ను కోరి” ఫేం శివ నిర్వాన డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని సాహు గారపాటి ఇంకా హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.

First Published:  21 Nov 2018 1:32 AM GMT
Next Story