Telugu Global
Cinema & Entertainment

రజనీకాంత్ కోసం 10వేల తెరలు

ఎంత వసూళ్లు వస్తాయనేది మేకర్స్ చేతిలో లేదు. కానీ ఎన్ని స్క్రీన్స్ కావాలంటే అన్ని స్క్రీన్స్ పై రిలీజ్ చేసే అంశం మాత్రం మేకర్స్ చేతిలో ఉంది. ఇండియాలోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 2.0 సినిమాకు సంబంధించి ప్రస్తుతం నిర్మాతలు ఇదే పనిలో ఉన్నారు. ఒకేరోజు ఏకంగా 10వేల తెరలపై సినిమాను వివిధ ఫార్మాట్స్ లో, వివిధ భాషల్లో ప్రదర్శించడానికి భారీగా ఏర్పాట్లుచేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే మల్టీప్లెక్స్ నిర్వహకులు, ఎగ్జిబిటర్లతో ఒప్పందాలు చేసుకున్న 2.0 […]

రజనీకాంత్ కోసం 10వేల తెరలు
X

ఎంత వసూళ్లు వస్తాయనేది మేకర్స్ చేతిలో లేదు. కానీ ఎన్ని స్క్రీన్స్ కావాలంటే అన్ని స్క్రీన్స్ పై రిలీజ్ చేసే అంశం మాత్రం మేకర్స్ చేతిలో ఉంది. ఇండియాలోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 2.0 సినిమాకు సంబంధించి ప్రస్తుతం నిర్మాతలు ఇదే పనిలో ఉన్నారు. ఒకేరోజు ఏకంగా 10వేల తెరలపై సినిమాను వివిధ ఫార్మాట్స్ లో, వివిధ భాషల్లో ప్రదర్శించడానికి భారీగా ఏర్పాట్లుచేస్తున్నారు.

ఈ మేరకు ఇప్పటికే మల్టీప్లెక్స్ నిర్వహకులు, ఎగ్జిబిటర్లతో ఒప్పందాలు చేసుకున్న 2.0 యూనిట్.. 9వేలకు పైగా స్క్రీన్స్ సంపాదించింది. విడుదలకు ఇంకా వారం రోజులు టైం ఉంది. ఈ 7 రోజుల్లో మరో వెయ్యి స్క్రీన్స్ ఎలాగైనా సంపాదించి వరల్డ్ వైడ్ ఒకేసారి 10వేల తెరలపై 2.0 సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. భారతీయ సినీచరిత్రకు సంబంధించి ఇదో పెద్ద రికార్డు అవుతుంది.

ప్రస్తుతానికైతే రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో థియేటర్ కౌంట్ తెలిసిపోయింది. ఏపీ, తెలంగాణలో 2.0 కోసం ఏకంగా 1200 తెరలు కేటాయించారు. రజనీకాంత్ కు క్రేజ్ ఎక్కువగా ఉన్న తమిళనాడు కంటే ఏపీ, నైజాంలోనే ఎక్కువ స్క్రీన్స్ దక్కాయి.

తెలుగు రాష్ట్రాల రైట్స్ కింద 78 కోట్ల రూపాయలకు 2.0 రైట్స్ దక్కించుకున్నారు నిర్మాత ఎన్వీ ప్రసాద్. రజనీకాంత్ గత చిత్రాల ఫలితాలతో పోలిస్తే ఇది చాలా పెద్ద రిస్క్. అయినప్పటికీ సినిమాపై నమ్మకంతో ఇంతకు తెగించారు. మరి ఈ సినిమా ఆడుతుందా.. తెలుగులో రజనీకాంత్ కు గత వైభవాన్ని కట్టబెడుతుందా.. వెయిట్ అండ్ సీ.

First Published:  21 Nov 2018 6:09 AM GMT
Next Story