Telugu Global
Cinema & Entertainment

త్రివిక్రమ్ కి వార్నింగ్ ఇచ్చిన స్టార్ ప్రొడ్యూసర్స్

ఇప్పుడు తెలుగు లో వరుస సినిమాలు నిర్మిస్తూ ప్రొడ్యూసర్స్ గా దూసుకుపోతున్నారు మైత్రి మూవీ మేకర్స్ వారు. వారు అసలు సినిమా నిర్మాణంలో దిగడమే ఆలస్యం పలువురు హీరోలకు, దర్శకులకు అడ్వాన్స్ లు ఇచ్చారు. అయితే అందులో కొంతమందితో సినిమాలు చేసారు, చేస్తున్నారు కానీ ఇంకొంతమందితో మాత్రం సినిమాలు చేయలేక పోతున్నారు. ఇక త్రివిక్రమ్ విషయానికి వస్తే ఇతడికి అడ్వాన్స్ ఇచ్చారు కానీ సినిమా అయితే చేయలేదు. అయితే ఇటివలే త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో సినిమా […]

త్రివిక్రమ్ కి వార్నింగ్ ఇచ్చిన స్టార్ ప్రొడ్యూసర్స్
X

ఇప్పుడు తెలుగు లో వరుస సినిమాలు నిర్మిస్తూ ప్రొడ్యూసర్స్ గా దూసుకుపోతున్నారు మైత్రి మూవీ మేకర్స్ వారు. వారు అసలు సినిమా నిర్మాణంలో దిగడమే ఆలస్యం పలువురు హీరోలకు, దర్శకులకు అడ్వాన్స్ లు ఇచ్చారు. అయితే అందులో కొంతమందితో సినిమాలు చేసారు, చేస్తున్నారు కానీ ఇంకొంతమందితో మాత్రం సినిమాలు చేయలేక పోతున్నారు.

ఇక త్రివిక్రమ్ విషయానికి వస్తే ఇతడికి అడ్వాన్స్ ఇచ్చారు కానీ సినిమా అయితే చేయలేదు. అయితే ఇటివలే త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడు అనే న్యూస్ బయటకి వచ్చింది. ఆ సినిమాని తమ ప్రొడక్షన్ హౌస్ లో చేయాలి అని మైత్రి వారు అడిగారట. అందుకు త్రివిక్రమ్ ఒప్పుకోలేదు. అంతేకాదు కావాలంటే మీ అడ్వాన్స్ మీకు తిరిగి ఇచ్చేస్తాను అంటూ చెప్పాడట. దాంతో ఖంగుతిన్న మైత్రి మూవీస్ వాళ్ళు మా అడ్వాన్స్ ఇవ్వాల్సి వస్తే వడ్డీతో సహా చెల్లిస్తే తప్పకుండా తీసుకుంటామని గట్టిగా వార్నింగ్ ఇచ్చారట. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా త్రివిక్రమ్ ఓన్లీ హారిక హాసిని క్రియేషన్స్ వారితో మాత్రమే సినిమాలు చేస్తున్నాడు.

First Published:  20 Nov 2018 10:24 PM GMT
Next Story