Telugu Global
Cinema & Entertainment

మరో నిర్మాణ సంస్థను స్థాపిస్తున్న అక్కినేని నాగార్జున

దగ్గుబాటి సురేష్ బాబు ఒకప్పుడు కేవలం పెద్ద బడ్జెట్ సినిమాలు మాత్రమే నిర్మించాడు, కానీ రాను రాను భారీ బడ్జెట్ సినిమాలు తగ్గించేసి చిన్న సినిమాలు నిర్మిస్తూ చిన్న సినిమాల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఇదే బాటలో అక్కినేని నాగార్జున రావాలి అని ట్రై చేస్తున్నాడు అంట. ఇటివల కాలంలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణం లో ఎక్కువగా వారి ఇంటి సినిమాలను మాత్రమే నిర్మిస్తున్నారు. బయట సినిమాలు ఏవి నిర్మించడం లేదు. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ […]

మరో నిర్మాణ సంస్థను స్థాపిస్తున్న అక్కినేని నాగార్జున
X

దగ్గుబాటి సురేష్ బాబు ఒకప్పుడు కేవలం పెద్ద బడ్జెట్ సినిమాలు మాత్రమే నిర్మించాడు, కానీ రాను రాను భారీ బడ్జెట్ సినిమాలు తగ్గించేసి చిన్న సినిమాలు నిర్మిస్తూ చిన్న సినిమాల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఇదే బాటలో అక్కినేని నాగార్జున రావాలి అని ట్రై చేస్తున్నాడు అంట. ఇటివల కాలంలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణం లో ఎక్కువగా వారి ఇంటి సినిమాలను మాత్రమే నిర్మిస్తున్నారు. బయట సినిమాలు ఏవి నిర్మించడం లేదు.

అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ ఉండగానే నాగార్జున మనం ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ ను వారి సినిమా కి గుర్తుగా రూపొందించారు. అయితే తాజా సమాచారం ప్రకారం నాగార్జున కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించబోతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ బ్యానర్ ద్వారా తను కూడా సురేష్ బాబు లాగ కేవలం చిన్న సినిమాలు మాత్రమే నిర్మించాలి అని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఈ బ్యానర్ లో మొదటి సినిమాని రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్ గా స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా ఈ విషయం పై నాగార్జున నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

First Published:  20 Nov 2018 11:00 PM GMT
Next Story