Telugu Global
NEWS

పోటీకి జనసేన నో...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని జనసేన నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని జనసేన ప్రకటించింది. సమయం లేకపోవడం వల్లే పోటీ చేయడం లేదని నామినేషన్ల గడువు ముగిసిన తర్వాత ప్రకటన విడుదల చేసింది. ఎన్నికలు అనుకున్న సమయంలోనే జరిగి ఉంటే తెలంగాణలో పోటీ చేసేవారిమని ఆ పార్టీ వివరించింది. కానీ ముందస్తు ఎన్నికలు రావడంతో కొత్తగా ఆవిర్భవించిన జనసేనను ఎన్నికల బరిలో నిలపడం ఒకింత కష్టతరంగా భావించినట్టు వెల్లడించింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం తెలంగాణలోనూ జనసేన […]

పోటీకి జనసేన నో...
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని జనసేన నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని జనసేన ప్రకటించింది. సమయం లేకపోవడం వల్లే పోటీ చేయడం లేదని నామినేషన్ల గడువు ముగిసిన తర్వాత ప్రకటన విడుదల చేసింది.

ఎన్నికలు అనుకున్న సమయంలోనే జరిగి ఉంటే తెలంగాణలో పోటీ చేసేవారిమని ఆ పార్టీ వివరించింది. కానీ ముందస్తు ఎన్నికలు రావడంతో కొత్తగా ఆవిర్భవించిన జనసేనను ఎన్నికల బరిలో నిలపడం ఒకింత కష్టతరంగా భావించినట్టు వెల్లడించింది.

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం తెలంగాణలోనూ జనసేన పోటీ చేస్తుందని.. ఈ మేరకు పార్టీ నేతల సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించినట్టు జనసేన ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికలకు జనసేన ఇప్పటి నుంచే తెలంగాణలోనూ సన్నద్దమవుతుందని వివరించింది.

First Published:  19 Nov 2018 9:12 PM GMT
Next Story