Telugu Global
NEWS

మనిషి ఎక్కువ రోజులు ఎలా బతకాలో నేర్పేందుకు రాత్రి పగలూ కష్టపడుతున్నా- చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో జరిగిన భూసేవా రాష్ట్ర స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన… పలు అంశాలను ప్రస్తావించారు. ఎవరి భూమి వారి జేబులో ఉన్నట్టేనన్నారు. ఎప్పుడు కావాల్సినా తన భూమి రికార్డులను తనిఖీ చేసుకోవచ్చన్నారు. సొంత భార్య భూమిని కొట్టేసేందుకు కూడా వీలుండదన్నారు. భూమి యజమాని వేలిముద్ర పెడితేనే భూమి అమ్మకం సాధ్యమవుతుందన్నారు. షేర్ మార్కెట్‌ మొత్తం డిజిటలైజ్ అయి ఉంటుందని…. షేర్‌ అమ్మాలంటే వెంటనే జరిగిపోతుందని…. భవిష్యత్తులో […]

మనిషి ఎక్కువ రోజులు ఎలా బతకాలో నేర్పేందుకు రాత్రి పగలూ కష్టపడుతున్నా- చంద్రబాబు
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో జరిగిన భూసేవా రాష్ట్ర స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన… పలు అంశాలను ప్రస్తావించారు.

ఎవరి భూమి వారి జేబులో ఉన్నట్టేనన్నారు. ఎప్పుడు కావాల్సినా తన భూమి రికార్డులను తనిఖీ చేసుకోవచ్చన్నారు. సొంత భార్య భూమిని కొట్టేసేందుకు కూడా వీలుండదన్నారు. భూమి యజమాని వేలిముద్ర పెడితేనే భూమి అమ్మకం సాధ్యమవుతుందన్నారు. షేర్ మార్కెట్‌ మొత్తం డిజిటలైజ్ అయి ఉంటుందని…. షేర్‌ అమ్మాలంటే వెంటనే జరిగిపోతుందని…. భవిష్యత్తులో భూమిని కూడా అదే తరహాలో అమ్మకాలు సాగించేలా చేస్తామన్నారు.

భగవంతుడు చాలా గొప్పవాడని అందుకే ఒకరికి ఉన్న వేలి ముద్రలు మరొకరికి లేకుండా మనిషిని సృష్టించారని చంద్రబాబు చెప్పారు. తాను గతంలో రెవెన్యూ మినిస్టర్‌గా కూడా పనిచేశానని… కానీ అడంగల్‌ అంటే ఏంటో ఇప్పటికీ తనకు అర్థం కావడం లేదన్నారు. ఆ లెక్కలు బ్రిటిష్ వాళ్లకు మాత్రమే అర్థమవుతాయన్నారు. కరణాలను రద్దు చేసిన రోజే తెలంగాణ వారికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. అలా చేసిన ఘనత ఎన్టీఆర్‌కు మాత్రమే దక్కుతుందన్నారు.

ప్రతి రైతు ఆలోచించుకోవాలని…. మా పార్టీ వాడు చెప్పాడు, మా కులపోడు చెప్పాడు, మా ప్రాంతం వాడు చెప్పాడు అని మరో పార్టీకి ఎందుకు ఓటేయాలని అనుకుంటే నష్టపోయేది నాకంటే మీరే అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎరువులు లేని పంట తింటే బాగుంటుందన్నారు.

ఏపీలో ఉంటే మరో 10ఏళ్లు ఎక్కువ బతుకుతారన్న పరిస్థితి తీసుకొస్తానన్నారు. ప్రతి మనిషి ఎక్కువ రోజులు బతకాలనుకుంటారని… అలాంటి వారు ఎక్కువ రోజులు ఎలా బతకాలో నేర్పించేదానికి తాను రేయింబవళ్లు కష్టపడుతున్నానని చంద్రబాబు చెప్పారు.

గ్రామాల్లో ఇప్పటికే మార్పు వచ్చిందన్నారు. ఒకప్పుడు వర్షకాలం వస్తే బురదలో తిరిగేవారన్నారు. కానీ ఇప్పుడు సిమెంట్‌ రోడ్లు వేసి బురద లేకుండా చేశామన్నారు. ఒకప్పుడు రోడ్ల మీద పేడ ఉండేదన్నారు. కానీ ఇప్పుడు పేడ కూడా లేకుండా చేస్తున్నామన్నారు. ప్రతి ఊర్లో పేడను సేకరించి నేరుగా ఒకచోటికి చేర్చేలా చేస్తున్నామన్నారు.

ఇళ్ల వద్ద చెట్లు కాదని…. చెట్లలోనే ఇల్లు ఉండాలన్నారు. ఊర్లో చెట్లు కాదు…. చెట్లలో ఊరు ఉండాలన్నారు చంద్రబాబు. తాను చెప్పేవన్నీ వింటే ఎవరికైనా ఏదేదో చెబుతున్నారని అనుకుంటారని…. కానీ భవిష్యత్తు కోసం ఇవన్నీ తాను చెబుతున్నానని చంద్రబాబు వివరించారు.

First Published:  20 Nov 2018 4:00 AM GMT
Next Story