Telugu Global
Cinema & Entertainment

అభిమానులని హర్ట్ చేసిన విజయ్ దేవరకొండ

 “టాక్సీ వాలా” సినిమా రిలీజ్ కి ముందే పైరసీ అయిన కూడా సినిమా ధియేటర్స్ లో మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే తోలి రోజే పెట్టిన పెట్టుబడి మొత్తం రాబట్టిన ఈ సినిమా ప్రస్తుతం ప్రాఫిట్ జోన్ లో ఉంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో ఒక విషయం గురించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ అభిమానులని హర్ట్ చేసాడు. ఇప్పటి నుంచి ఏడాది కి ఒక్క సినిమానే మాత్రామే చెయ్యగలను అని విజయ్ చెప్పగానే […]

అభిమానులని హర్ట్ చేసిన విజయ్ దేవరకొండ
X

“టాక్సీ వాలా” సినిమా రిలీజ్ కి ముందే పైరసీ అయిన కూడా సినిమా ధియేటర్స్ లో మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే తోలి రోజే పెట్టిన పెట్టుబడి మొత్తం రాబట్టిన ఈ సినిమా ప్రస్తుతం ప్రాఫిట్ జోన్ లో ఉంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో ఒక విషయం గురించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ అభిమానులని హర్ట్ చేసాడు.

ఇప్పటి నుంచి ఏడాది కి ఒక్క సినిమానే మాత్రామే చెయ్యగలను అని విజయ్ చెప్పగానే అభిమానులు అందరూ తీవ్ర నిరాశకి గురయ్యారు. స్టార్ హీరోస్ అయిన మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి వార్ ఏడాది కి రెండు సినిమాలు చెయ్యడానికి రెడీ అవుతుంటే విజయ్ దేవరకొండ మాత్రం ఎందుకు ఒక్క సినిమా మాత్రమే అని విజయ్ ని అడుగుతున్నారు ఫ్యాన్స్. విజయ్ దేవరకొండ కి చాలా ఆఫర్స్ ఉండటం వల్ల డేట్స్ సర్దుబాటు విషయంలో కూడా ప్రాబ్లం వల్ల ఏడాది కి ఒక్క సినిమా మాత్రమే ఇవ్వగలడు అనేది ఫిలిం నగర్ టాక్. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఓకే చేసిన సినిమాల్లో షూటింగ్ దశలో ఉన్న సినిమా మాత్రం “డియర్ కామ్రేడ్” ఒక్కటే. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అవుతుంది.

First Published:  18 Nov 2018 9:18 PM GMT
Next Story