Telugu Global
Cinema & Entertainment

మెగా మల్టీస్టారర్ ప్రారంభం

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్టీఆర్-రామ్ చరణ్ భారీ మల్టీస్టారర్ సినిమా ఈరోజు సెట్స్ పైకి వచ్చింది. మొదటి షెడ్యూల్ లో కేవలం ఎన్టీఆర్ పై మాత్రమే చిత్రీకరణ ఉంటుందని అంతా భావించారు. కానీ మొదటి రోజు షూటింగ్ కు ఎన్టీఆర్ తో పాటు చరణ్ కూడా వచ్చాడు. వీళ్లిద్దరిపై ఫస్ట్ షాట్ తెరకెక్కించాడు దర్శకుడు రాజమౌళి. షూటింగ్ మొదలైన మొదటి రోజు నుంచే ఈ సినిమాకు ప్రచారం స్టార్ట్ చేశాడు జక్కన్న. షూటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఎన్టీఆర్, […]

మెగా మల్టీస్టారర్ ప్రారంభం
X

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్టీఆర్-రామ్ చరణ్ భారీ మల్టీస్టారర్ సినిమా ఈరోజు సెట్స్ పైకి వచ్చింది. మొదటి షెడ్యూల్ లో కేవలం ఎన్టీఆర్ పై మాత్రమే చిత్రీకరణ ఉంటుందని అంతా భావించారు. కానీ మొదటి రోజు షూటింగ్ కు ఎన్టీఆర్ తో పాటు చరణ్ కూడా వచ్చాడు. వీళ్లిద్దరిపై ఫస్ట్ షాట్ తెరకెక్కించాడు దర్శకుడు రాజమౌళి.

షూటింగ్ మొదలైన మొదటి రోజు నుంచే ఈ సినిమాకు ప్రచారం స్టార్ట్ చేశాడు జక్కన్న. షూటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఎన్టీఆర్, చెర్రీతో దిగిన ఫొటోను సోషల్ మీడియా వేదికలపైకి వదిలాడు. ఆ వెంటనే కాస్త గ్యాప్ ఇచ్చి ఫస్ట్ షాట్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో, ఈ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే మొదటి రోజు మొదటి షాట్ కాబట్టి రామ్ చరణ్ వచ్చాడు. ఫస్ట్ షెడ్యూల్ మొత్తం ఎన్టీఆర్ పైనే జరుగుతుంది. వినయ విధేయ రామ పని పూర్తయిన వెంటనే చరణ్ కూడా జాయిన్ అవుతాడు. ఈ గ్యాప్ లో అటు ఎన్టీఆర్, ఇటు చెర్రీ ఇద్దరూ పూర్తిగా మేకవర్ అవుతారు.

ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత సినిమా టైటిల్ ను ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ మూవీకి రామరావణ రాజ్యం (ఆర్-ఆర్-ఆర్) అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

First Published:  19 Nov 2018 6:07 AM GMT
Next Story