Telugu Global
Cinema & Entertainment

ఫస్ట్ టైం ప్రియుడితో పుట్టినరోజు వేడుక

లాస్ట్ టైం నయనతార పుట్టినరోజు చాలా సీక్రెట్ గా జరిగింది. ఆ వేడుకల్లో ఒక వేడుకను ఎవరికీ కనిపించకుండా సెలబ్రేట్ చేసుకుంది ఈ బ్యూటీ. అయితే ఈ ఏడాది మాత్రం ఆ సీక్రెట్ సెలబ్రేషన్ ను పబ్లిక్ గానే చేసుకుంది నయనతార. అవును.. నయనతార-విఘ్నేష్ శివన్ ప్రేమాయణం ఇప్పుడు ఓపెన్ సీక్రెట్. గతేడాది నయన్ పుట్టినరోజుకు సీక్రెట్ గా వెళ్లి, గుట్టుచప్పుడు కాకుండా వచ్చేసిన విఘ్నేష్.. ఈ ఏడాది మాత్రం బహిరంగంగానే ఆమె పుట్టినరోజు వేడుకను నిర్వహించాడు. […]

ఫస్ట్ టైం ప్రియుడితో పుట్టినరోజు వేడుక
X

లాస్ట్ టైం నయనతార పుట్టినరోజు చాలా సీక్రెట్ గా జరిగింది. ఆ వేడుకల్లో ఒక వేడుకను ఎవరికీ కనిపించకుండా సెలబ్రేట్ చేసుకుంది ఈ బ్యూటీ. అయితే ఈ ఏడాది మాత్రం ఆ సీక్రెట్ సెలబ్రేషన్ ను పబ్లిక్ గానే చేసుకుంది నయనతార. అవును.. నయనతార-విఘ్నేష్ శివన్ ప్రేమాయణం ఇప్పుడు ఓపెన్ సీక్రెట్. గతేడాది నయన్ పుట్టినరోజుకు సీక్రెట్ గా వెళ్లి, గుట్టుచప్పుడు కాకుండా వచ్చేసిన విఘ్నేష్.. ఈ ఏడాది మాత్రం బహిరంగంగానే ఆమె పుట్టినరోజు వేడుకను నిర్వహించాడు.

కేవలం నయన్ కోసమే తన రూమ్ మొత్తాన్ని నీట్ గా అలంకరించాడు విఘ్నేష్. అత్యంత సన్నిహితులైన ముగ్గుర్ని మాత్రమే ఆహ్వానించాడు. అలా ఆ ముగ్గురి మధ్య నయన్ బర్త్ డేను సెలబ్రేట్ చేశాడు విఘ్నేష్. ఈసారి మాత్రం ఈ జంట మొహమాటపడలేదు. తమ ఫొటోల్ని బయటకు రిలీజ్ చేశారు. పుట్టినరోజు సందర్భంగా నయన్ కు లక్షన్నర రూపాయల ఖరీదైన బహుమతిని అందించాడు విఘ్నేష్.

పీకల్లోతు ప్రేమలో ఉన్న వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకొని ఓ ఇంటివారు కాబోతున్నారు. ప్రస్తుతం నయన్ కు తమిళనాట విపరీతంగా క్రేజ్ ఉంది. ఆమె ఓ సినిమాకు 2 కోట్ల రూపాయలకు పైనే పారితోషికం తీసుకుంటోంది. ఇలాంటి టైమ్ లో పెళ్లి చేసుకొని క్రేజ్ తగ్గించుకునే కంటే, కొన్నాళ్లు ఆగి పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉంది నయన్.

First Published:  19 Nov 2018 5:57 AM GMT
Next Story