Telugu Global
NEWS

ఒక మీడియా సంస్థకు 700 కోట్లు దోచిపెట్టారు " మాజీ సీఎస్‌ అజయ్‌ కల్లం

మాజీ సీఎస్‌ అజయ్‌ కల్లం ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అవినీతి పతాక స్థాయికి చేరిందన్నారు. నాలుగున్నరేళ్లలో జరిగిన పలు కుంభకోణాల గురించి ఆయన వివరించారు. తిరుపతిలో జరిగిన సేవ్ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమంలో మాట్లాడిన కల్లం…. ఉపాధి హామీ పథకానికి కేంద్రం 20వేల కోట్లు కేటాయిస్తే అందులో మూడో వంతు నిధులు దోపిడికి గురయ్యాయన్నారు. మార్కెట్‌లో రూ. 4వేలు విలువ చేసే సెల్‌ఫోన్లను ఏకంగా ఒక్కొక్కటి రూ. 7,500 చొప్పున ఐదు లక్షల […]

ఒక మీడియా సంస్థకు 700 కోట్లు దోచిపెట్టారు  మాజీ సీఎస్‌ అజయ్‌ కల్లం
X

మాజీ సీఎస్‌ అజయ్‌ కల్లం ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అవినీతి పతాక స్థాయికి చేరిందన్నారు. నాలుగున్నరేళ్లలో జరిగిన పలు కుంభకోణాల గురించి ఆయన వివరించారు. తిరుపతిలో జరిగిన సేవ్ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమంలో మాట్లాడిన కల్లం…. ఉపాధి హామీ పథకానికి కేంద్రం 20వేల కోట్లు కేటాయిస్తే అందులో మూడో వంతు నిధులు దోపిడికి గురయ్యాయన్నారు.

మార్కెట్‌లో రూ. 4వేలు విలువ చేసే సెల్‌ఫోన్లను ఏకంగా ఒక్కొక్కటి రూ. 7,500 చొప్పున ఐదు లక్షల ఫోన్లు కొనుగోలు చేశారన్నారు. ఈ ఒక్క స్కాంలోనే 150 కోట్లు స్వాహా చేశారని వివరించారు. ఐటీ పేరుతో 450 కోట్ల విలువ చేసే భూమిని కేవలం 45లక్షలకు కట్టబెట్టారన్నారు.

రైతులు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించక ఓవైపు అప్పులపాలవుతుంటే…. మరోవైపు, ప్రభుత్వం విదేశాల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకుని వ్యాపారులకు దోచిపెడుతోందని ఆరోపించారు. రాజధానిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.11వేలు చెల్లించినా చిన్నపాటి వర్షానికే అది కారుతోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు.

ఏపీలో కేవలం ఒక టీవీ చానల్‌కే నాలుగేళ్లలో ఏడు వందల కోట్లు ప్రభుత్వం చెల్లించిందని వెల్లడించారు. ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సిన డబ్బులను ఇలా ప్రచారానికి వాడుతున్నారని ఆక్షేపించారు. చంద్రబాబునాయుడు అక్రమ సంపాదనను కర్ణాటక, గుజరాత్, తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు ఖర్చుచేస్తున్నారని ఆయన ఆరోపించారు.

అవినీతి, అక్రమాలు, దోపిడీలు మితిమీరిన తరుణంలో రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని సమాచార హక్కు మాజీ కమిషనర్‌ విజయబాబు పిలుపునిచ్చారు. హుందాగా వ్యవహరించాల్సిన స్పీకర్‌ సైతం పార్టీ ఫిరాయింపుదారులకు మద్దతుగా నిలవటం దౌర్భాగ్యమన్నారు. జయంతికి, వర్ధంతికి తేడా తెలియని వ్యక్తిని మంత్రిగా చేసిన ఘనత మన రాష్ట్రానికే దక్కిందని ఆవేదన చెందారు.

First Published:  18 Nov 2018 8:54 PM GMT
Next Story