Telugu Global
Cinema & Entertainment

టాక్సీవాలా ఫస్ట్ డే వసూళ్లు

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సీవాలా తొలిరోజు డీసెంట్ టాక్ తెచ్చుకుంది. ఆల్రెడీ పైరసీ ప్రింట్ రిలీజ్ అయినప్పటికీ మొదటి రోజు 70శాతానికి పైగా ఆక్యుపెన్సీ ఉండడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఓ మోస్తరుగా విడుదలైన ఈ సినిమాకు తొలిరోజు వరల్డ్ వైడ్ 4 కోట్ల 50 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఈ సినిమాతో నోటా ఎఫెక్ట్ నుంచి పూర్తిగా బయటపడ్డాడు విజయ్ దేవరకొండ. టాక్సీవాలా సక్సెస్ అతడికి ఆక్సిజన్ అందించింది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడం, […]

టాక్సీవాలా ఫస్ట్ డే వసూళ్లు
X
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సీవాలా తొలిరోజు డీసెంట్ టాక్ తెచ్చుకుంది. ఆల్రెడీ పైరసీ ప్రింట్ రిలీజ్ అయినప్పటికీ మొదటి రోజు 70శాతానికి పైగా ఆక్యుపెన్సీ ఉండడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఓ మోస్తరుగా విడుదలైన ఈ సినిమాకు తొలిరోజు వరల్డ్ వైడ్ 4 కోట్ల 50 లక్షల రూపాయల షేర్ వచ్చింది.
ఈ సినిమాతో నోటా ఎఫెక్ట్ నుంచి పూర్తిగా బయటపడ్డాడు విజయ్ దేవరకొండ. టాక్సీవాలా సక్సెస్ అతడికి ఆక్సిజన్ అందించింది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడం, థియేటర్లలో మరో సినిమా లేకపోవడంతో.. టాక్సీవాలా థియేటర్లలో నిలబడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మొదటి రోజు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి.
నైజాం – రూ. 1.40 కోట్లు
సీడెడ్ – రూ. 57 లక్షలు
ఉత్తరాంధ్ర – రూ. 37 లక్షలు
ఈస్ట్ – రూ. 22 లక్షలు
వెస్ట్ – రూ. 27 లక్షలు
కృష్ణా – రూ. 23 లక్షలు
గుంటూరు – రూ. 26 లక్షలు
నెల్లూరు – రూ. 11 లక్షలు
First Published:  18 Nov 2018 6:07 AM GMT
Next Story