Telugu Global
NEWS

సవాల్ విసిరిన రేవంత్ కామ్ అయ్యాడు!

తమ పార్టీలోకి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఇద్దరు ఎంపీలు రాబోతున్నారని…. కేసీఆర్ కు దమ్ముంటే ఆ చేరికలను ఆపాలని రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరాడు. నామినేషన్ల వేళ రేవంత్ ఈ తరహాలో సవాల్ విసరడం ఆసక్తిదాయకంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఇద్దరు ఎంపీలు టీఆర్ ఎస్ ను వీడితే అది కేసీఆర్ కు కూడా మైనస్సే అవుతుందని చాలా మంది విశ్లేషించారు. రేవంత్ అంతలా సవాల్ విసరడంతో ఆ విషయాన్ని నమ్మేశారు కూడా. […]

సవాల్ విసిరిన రేవంత్ కామ్ అయ్యాడు!
X

తమ పార్టీలోకి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఇద్దరు ఎంపీలు రాబోతున్నారని…. కేసీఆర్ కు దమ్ముంటే ఆ చేరికలను ఆపాలని రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరాడు. నామినేషన్ల వేళ రేవంత్ ఈ తరహాలో సవాల్ విసరడం ఆసక్తిదాయకంగా మారింది.

అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఇద్దరు ఎంపీలు టీఆర్ ఎస్ ను వీడితే అది కేసీఆర్ కు కూడా మైనస్సే అవుతుందని చాలా మంది విశ్లేషించారు. రేవంత్ అంతలా సవాల్ విసరడంతో ఆ విషయాన్ని నమ్మేశారు కూడా.

ఇంతకీ ఆ ఇద్దరు ఎంపీలు ఎవరు? అంటే…. మీడియా కొన్ని పేర్లను ప్రచారంలోకి తీసుకొచ్చింది. రాజ్యసభ సభ్యుడు డీఎస్, లోక్ సభ సభ్యులు సీతారాం నాయక్, విశ్వేశ్వర రెడ్డి పేర్లను మీడియా ప్రచారంలోకి తెచ్చింది.

వీరిలో డీఎస్ ను పక్కన పెడితే…. విశ్వేశ్వర రెడ్డి, సీతారాం నాయక్ ల పేర్ల పై ఆసక్తిదాయకమైన చర్చ జరిగింది. వీరు తెరాసను ఎందుకు వీడాలనుకుంటున్నారనే అంశంపై ప్రచారం మొదలైంది.

అయితే ఆ విషయంలో సదరు ఎంపీలు రియాక్ట్ అయ్యారు. తాము టీఆర్ ఎస్ ను వీడే ప్రసక్తి లేదని వారిద్దరూ స్పష్టం చేయడం విశేషం. తమ పేర్లు ప్రచారంలోకి రావడంతో విశ్వేశ్వర రెడ్డి, సీతారాం నాయక్ లు స్పందించారు.

తాము తెరాసను వీడమని, తమపై అబద్ధపు ప్రచారం జరుగుతోందని వారు ధ్వజమెత్తారు. మరి రేవంత్ ఇద్దరు ఎంపీలు అనగానే తెరపైకి వచ్చిన ఇద్దరూ నో చెప్పేశారు. మరి దీనిపై రేవంత్ స్పందించడం లేదిప్పుడు!

First Published:  18 Nov 2018 1:10 AM GMT
Next Story