Telugu Global
Cinema & Entertainment

పూరీ దర్శకత్వంలో రామ్ ?

 డైరెక్టర్ అయిన పూరీ జగన్నాధ్ గత కొంత కాలంగా ఫ్లాప్స్ లో ఉన్న సంగతి అందరికి తెలిసిందే. పూరీ జగన్నాధ్ తన గత సినిమా అయిన “మెహబూబా” తో హిట్టు కొడతాడు అనుకుంటే కొడుక్కి కూడా ఫ్లాప్ ని మూటగట్టాడు పూరీ జగన్నాధ్. అయితే పూరీ జగన్నాథ్ కొత్త వాళ్ళ కోసం కథ రాస్తున్నాడు త్వరలోనే ఆ సినిమా పట్టాలేక్కుతుంది అనే రూమర్స్ వచ్చాయి. మరి కొంత మంది అయితే పూరీ జగన్నాధ్ తన తదుపరి సినిమాని […]

పూరీ దర్శకత్వంలో రామ్ ?
X

డైరెక్టర్ అయిన పూరీ జగన్నాధ్ గత కొంత కాలంగా ఫ్లాప్స్ లో ఉన్న సంగతి అందరికి తెలిసిందే. పూరీ జగన్నాధ్ తన గత సినిమా అయిన “మెహబూబా” తో హిట్టు కొడతాడు అనుకుంటే కొడుక్కి కూడా ఫ్లాప్ ని మూటగట్టాడు పూరీ జగన్నాధ్. అయితే పూరీ జగన్నాథ్ కొత్త వాళ్ళ కోసం కథ రాస్తున్నాడు త్వరలోనే ఆ సినిమా పట్టాలేక్కుతుంది అనే రూమర్స్ వచ్చాయి. మరి కొంత మంది అయితే పూరీ జగన్నాధ్ తన తదుపరి సినిమాని మళ్ళి తన కొడుకుతోనే తెరకేక్కిస్తున్నాడు అని కూడా అన్నారు.

కానీ పూరీ జగన్నాధ్ మాత్రం హీరో రామ్ కోసం ఒక మాస్ లవ్ స్టొరీ ని రెడీ చేసాడు అని తెలుస్తుంది. ఇప్పటికే రామ్ ని కలిసి కథ కూడా వినిపించాడట పూరీ జగన్నాధ్. పూరి జగన్నాధ్ ఇప్పటి వరకు రామ్ ని డైరెక్ట్ చెయ్యలేదు, కానీ తను అనుకున్న కథలో మాత్రం రామ్ ని మునుపెన్నడు చూడని విధంగా చూపించాలి అని ఫిక్స్ అయ్యాడట పూరీ జగన్నాధ్. రామ్ కూడా ఇటీవలే “హలో గురు ప్రేమకోసమే” సినిమాతో జస్ట్ ఆవరేజ్ హిట్ ని మాత్రమే అందుకున్నాడు.

First Published:  18 Nov 2018 6:24 AM GMT
Next Story