Telugu Global
NEWS

టీవీ డిబేట్ రాయుళ్ల‌కు టికెట్లు క‌ట్ !

కాంగ్రెస్‌, టీడీపీ, టీఆర్ఎస్…. పార్టీ ఏదైనా ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో ఒక‌టే సీన్ క‌న్పిస్తోంది. టీవీ చ‌ర్చ‌ల్లో పాల్గొనే నేత‌ల‌కు మాత్రం టికెట్లు క‌ట్ అయ్యాయి. టీవీ చ‌ర్చ‌లో పాల్గొని నేత‌లుగా చ‌లామ‌ణీ అవుదామ‌ని ప్లాన్‌లు వేసే వారికి ఇది ఓ ర‌కంగా హెచ్చ‌రిక లాంటిది. నాయ‌కుడిగా ఎదుగుదాం… రోజుకో టీవీ చాన‌ల్‌లో చ‌ర్చ‌లో పాల్గొందాం…. మైలేజీ కొట్టేద్దాం…. కానీ జ‌నాల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు దూరంగా బ‌తికేద్దాం…. అంటే పార్టీ టికెట్లు రావ‌ని మాత్రం ఈ ఎన్నిక‌ల సీజ‌న్ […]

టీవీ డిబేట్ రాయుళ్ల‌కు టికెట్లు క‌ట్ !
X

కాంగ్రెస్‌, టీడీపీ, టీఆర్ఎస్…. పార్టీ ఏదైనా ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో ఒక‌టే సీన్ క‌న్పిస్తోంది. టీవీ చ‌ర్చ‌ల్లో పాల్గొనే నేత‌ల‌కు మాత్రం టికెట్లు క‌ట్ అయ్యాయి. టీవీ చ‌ర్చ‌లో పాల్గొని నేత‌లుగా చ‌లామ‌ణీ అవుదామ‌ని ప్లాన్‌లు వేసే వారికి ఇది ఓ ర‌కంగా హెచ్చ‌రిక లాంటిది.

నాయ‌కుడిగా ఎదుగుదాం… రోజుకో టీవీ చాన‌ల్‌లో చ‌ర్చ‌లో పాల్గొందాం…. మైలేజీ కొట్టేద్దాం…. కానీ జ‌నాల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు దూరంగా బ‌తికేద్దాం…. అంటే పార్టీ టికెట్లు రావ‌ని మాత్రం ఈ ఎన్నిక‌ల సీజ‌న్ తేల్చింది. కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున వివిధ టీవీ చాన‌ళ్ల‌లో చ‌ర్చ‌లో పాల్గొంటున్న నేత‌ల‌కు ఇప్పుడు టికెట్లు రాలేదు.

కాంగ్రెస్ అధికార ప్ర‌తినిధులుగా చ‌లామ‌ణీ అయిన అద్దంకి ద‌యాక‌ర్‌, క్రిశాంక్‌తో పాటు కార్తీక్ రెడ్డిల‌కు ఈ సారి టికెట్లు రాలేదు. కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున వీరు వివిధ‌ టీవీ చాన‌ళ్ల‌లో చ‌ర్చ‌లో పాల్గొనేవారు. కానీ తీరా చూస్తే వారికి మాత్రం టికెట్ రాలేదు. అంతేకాదు…. కొద్దిరోజులుగా టీవీ చ‌ర్చ‌ల‌కు దూరంగా ఉంటున్న దాసోజు శ్ర‌వ‌ణ్‌కు టికెట్ ద‌క్కింది.

మ‌రోవైపు టీడీపీలో కూడా అధికార ప్ర‌తినిధులతో పాటు… టీవీ చ‌ర్చ‌ల్లో ఎక్కువ‌గా పాల్గొనే కోదాడ నేత బొల్లం మ‌ల్ల‌య్య యాద‌వ్‌, అర‌వింద్‌కుమార్ గౌడ్ లకు టికెట్ రాలేదు. కోదాడ టికెట్ ఆశించి భంగ‌ప‌డ్డ బొల్లం మ‌ల్ల‌య్య యాద‌వ్ ప‌రిస్థితి ఇప్పుడు ఏంట‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆయ‌న టీఆర్ఎస్‌లోకి వెళతారా? లేక రెబెల్‌గా పోటీ చేస్తారా? అనేది చూడాలి. కూక‌ట్‌ప‌ల్లి టికెట్ ఆశించిన ఇనుగాల పెద్దిరెడ్డికి కూడా ఇప్పుడు టికెట్ వ‌స్తుందో రాదో అనేది డౌట్‌. ఆయ‌న కూడా టీడీపీ త‌ర‌పున టీవీ చ‌ర్చ‌ల్లో వాద‌న‌లు వినిపించేవారు.

ఇటు టీఆర్ఎస్‌లో కూడా ఎక్కువ‌గా చ‌ర్చ‌లో పాల్గొనే ఎమ్మెల్సీలు ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి, కర్నె ప్ర‌భాక‌ర్‌ల‌కు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌నే కోరిక ఉండేది. ఎల్బీన‌గర్ నుంచి ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి, మునుగోడు నుంచి క‌ర్నె ప్ర‌భాక‌ర్ పోటీ చేయాల‌ని ప్లాన్ చేశారు. కానీ వారి ప్లాన్‌లు వ‌ర్క్‌వుట్ కాలేదు.

ఇటు టీవీ చ‌ర్చ‌ల్లో పాల్గొనే ఎంపీ సీతారాం నాయ‌క్ కూడా మ‌హ‌బూబాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని ఆలోచ‌న చేశారు. కానీ ఆయ‌న కోరిక‌ను నెరవేర లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీగా టికెట్ వ‌స్తుందో రాదో అనే అనుమానంతో ఆయ‌న ఎమ్మెల్యేగా బ‌రిలో ఉండాల‌ని ప్లాన్ వేశారు.

మొత్తానికి టీవీ చ‌ర్చ‌ల్లో ఊద‌ర‌గొడితే టికెట్లు రావ‌ని…. జ‌నాల్లో ఉండి….. లాబీయింగ్ చేయాలి…. అప్పుడే టికెట్ వ‌స్తుంది అంటూ రాజ‌కీయ పార్టీల ఆఫీసుల్లో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

First Published:  15 Nov 2018 8:45 PM GMT
Next Story